UGC : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఖుష్ కబర్ చెప్పింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(UGC). ఈ మేరకు కీలక నిర్ణయం ప్రకటించింది.
విద్యార్థులు ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదివేందుకు అనుమతించినట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. దీని వల్ల వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఈ మేరకు తమ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా రంగంలో గత కొంత కాలంగా రెండు డిగ్రీలు ఏక కాలంలో చేసేందుకు వీలు ఉండేది కాదు.
దీంతో విద్యార్థులకు చదవాలని ఉన్నా యూజీసీ నిర్ణయం వల్ల చదువుకోలేక పోయారు. చాలా మంది స్టూడెంట్స్ డ్యూయల్ డిగ్రీలు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.
మొత్తంగా విషయం గ్రహించిన యూజీసీ (UGC)సుదీర్ఘ కాలంగా పర్మిషన్ ఇవ్వాలా లేదా అన్న దానిపై చర్చిస్తూ వచ్చింది. చివరకు చైర్మన్ శుభవార్త అందించారు.
ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు తమకు ఇష్టమైన రెండు డిగ్రీలను ఏక కాలంలో చదివేందుకు, పూర్తి చేసేందుకు, పట్టాలు పొందేందుకు వీలు కలుగుతుంది. బహుళ డిగ్రీలు పొందేందుకు దోహదం చేస్తుంది.
ఈనెల 12న జరిగిన వర్చువల్ మీటింగ్ లో యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ మాట్లాడారు. ఇందుకు సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.
ఇందులో భాగంగా విద్యార్థులు ఒకే యూనివర్శిటీలో కానీ లేదా ఇతర యూనివర్శిటీలలో రెండు డిగ్రీలు చదివేందుకు వీలు కలుగుతుందన్నారు.
దీని వల్ల బహుళ నైపుణ్యాలను నేర్చుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.
Also Read : టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం