Ukraine President : రష్యా ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులకు పాల్పడుతోంది. బాంబుల మోత మోగిస్తోంది. క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ రాజధానిపై దాడులకు తెగ బడుతోంది రష్యా.
దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Ukraine President )కి యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా సైతం రమ్మని ఆహ్వానం పలికాయి. యుద్ధ సమయంలో ఇంకొకరైతే తప్పించుకుని పారి పోయేవాళ్లు.
కానీ ఈ యోధుడు చావనైనా చస్తా కానీ తల వంచే ప్రసక్తి లేదంటూ ప్రకటించాడు. చివరి రక్తపు బొట్టు వరకు రష్యాపై యుద్దం చేస్తామని వెల్లడించాడు. ప్రస్తుతం మనమంతా తుపాకులు ధరించి యుద్దానికి సన్నద్దం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ సమయంలో అమెరికా చీప్ జోసెఫ్ బైడెన్ స్వయంగా ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేశాడు. నీకు ఏం కావాలన్నా ఇస్తా. నీకు ఆశ్రయం కల్పిస్తా. నీకు నీ కుటుంబానికి మేం అండగాఉంటామని చెప్పాడు.
బైడెన్ తో పాటు యూరోపియన్ దేశాలు సైతం ఇదే అభిప్రాయాన్ని ప్రకటించాయి. రా రామ్మంటూ పిలిచాయి. కానీ అమెరికాతో పాటు యూరోపియన్ దేశాల అధ్యక్షులకు తాను ఎక్కడికీ రానని, మీ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపాడు.
అయితే ఈ భూమి కోసం నేను ఎంతో చేశాను. నాపై నమ్మకం ఉంచిన లక్షలాది ప్రజల క్షేమం నాకు ముఖ్యం. ఈ విపత్కాల, ఆపద సమయంలో వారిని విడిచి వెళ్లలేను.
అలా వెళితే నేను క్షమించరాని నేరం చేసిన వాడినవుతానంటూ ప్రకటించాడు. ప్రస్తుతం జెలెన్స్కీ ఇచ్చిన సందేశం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
Also Read : యుద్దం అంటే కామెడీ కాదు