Zelensky : భారత్ రాయబారిని తొలగించిన జెలెన్ స్కీ
జర్మనీ, చెక్ రిపబ్లిక్ , నార్వే, హంగేరీలకు షాక్
Zelensky : రష్యా ఏకపక్షంగా దాడికి పాల్పడుతున్న తరుణంలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి కారణం తెలియ చేయకుండానే భారత దేశానికి చెందిన రాయబారిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది ఒక రకంగా బిగ్ షాక్. ఇక ఇండియాతో పాటు జర్మనీ, చెక్ రిపబ్లిక్ , నార్వే, హంగేరీ దేశాలకు చెందిన అంబాసిడర్లను కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు ప్రెసిడెంట్.
మరో వైపు ఉక్రెయిన్ కు అంతర్జాతీయ మద్ధతును పెంచాలని వోలోడిమిర్ జెలెన్ స్కీ తన దౌత్యవేత్తలను కోరారు. ఈ విషయాన్ని దేశాధ్యక్షుడికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది ఆయా దేశాల రాయబారులను తొలగిస్తున్న విషయాన్ని.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్దాన్ని ప్రారంభించాడు. ఇప్పటి దాకా యుద్దం కొనసాగుతూనే ఉంది. వేలాది భవనాలు కూలి పోయాయి.
లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. శరణార్థులుగా మారి పోయారు. లెక్కల లేనంత మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదే సమయంలో రష్యా ఇంధన సరఫరాలు , యూరప్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడే జర్మనీకి సంబంధించి ఆ దేశ రాయబారిని తొలగించడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
మరో వైపు పుతిన్ కోరుకున్న జెలెన్ స్కీ(Zelensky) మరణం ఇంకా దరిదాపుల్లోకి రావడం లేదు. ఇదే సమయంలో తాను దేశం కోసం చని పోయేందుకు సిద్దంగా ఉన్నానని దమ్ముంటే తనతో పుతిన్ తలపడాలని సవాల్ విసిరారు జెలెన్ స్కీ.
Also Read : శ్రీలంక పీఎం విక్రమ సింఘే రాజీనామా