UN Chief : కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని అది తన రూపాన్ని మార్చుకుంటూ వస్తోందని హెచ్చరించారు యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్(UN Chief). ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కొత్త వేరియంట్ రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ప్రతి రోజూ 1.5 మిలియన్ల కొత్త కేసులు చూస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఆసియాలో ఎక్కువగా ఇది ప్రబలుతోందన్నారు. కొన్ని దేశాలు తమ అత్యధిక మరణాల రేటును నివేదిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వ్యక్తికి , ప్రతి చోటా వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు , ఫార్మా కంపెనీలు కలిసి పని చేయాలని గుటెర్రెస్ పిలుపు ఇచ్చారు.
కమిట్ మెంట్ సమ్మిట్ 2022 వన్ వరల్డ్ ప్రొటెక్టెడ్ బ్రేక్ కోవిడ్ నౌ అనే వీడియో సందేశంలో యుఎన్ చీఫ్ (UN Chief)మాట్లాడారు. ప్రధానంగా దీని పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని సూచించారు.
కొన్ని దేశాలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు గుటెర్రెస్. కరోనా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందుతోందని ఆవేదన చెందారు.
వ్యాక్సినేషన్ తీసుకుంటే కొంత మేరకు నివారించేందుకు వీలు కలుగుతుందని కానీ దానిని తీసుకోనట్లయితే ప్రమాదమని హెచ్చరించారు గుటెర్రెస్.
ఈ ఏడాది పూర్తయ్యే సరికి కనీసం 70 శాతానికి పైగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కానీ దానిని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. సంపన్న దేశాలతో పాటు పేద దేశాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయం గురించి హెచ్చరించిందని తెలిపారు ఆంటోనియో గుటెర్రెస్.
Also Read : పుతిన్ కూతుళ్లకు బిగ్ షాక్