UN Condemn Kailasa : కైలాస ప్రసంగం పరిగణలోకి తీసుకోం
అవన్నీ సంబంధం లేని సమర్పణలు
UN Condemn Kailasa : తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొని , దేశం విడిచి పారిపోయి కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన కైలాస నిత్యానందకు సంబంధించిన ప్రతినిధి ఐక్య రాజ్య సమితిలో పాల్గొనడం కలకలం రేపింది. ఆపై ఆమె సంచలన ఆరోపణలు కూడా చేసింది. దీనిపై భారత దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ దేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా (యుఎస్కే) అని కూడా పేరు పెట్టారు నిత్యానంద. ఈ సిటిజన్ షిప్ కూడా ఆహ్వానించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎవరైనా సరే తమ దేశానికి సంబంధించి పౌర సత్వం తీసుకోవచ్చంటూ పేర్కొన్నారు. ఈ తరుణంలో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఐక్య రాజ్య సమితి రంగంలోకి దిగింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. నిత్యానందకు సంబంధించిన కైలాస ద్వారా(UN Condemn Kailasa) సంబంధం లేని సమర్పణలను తోసి పుచ్చినట్లు యుఎన్ పేర్కొంది. వారి ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది.
జెనీవాలో భారత దేశ శాశ్వత మిషన్ నుండి ఎలాంటి స్పందన లేక పోవడం గమనార్హం. ఇక యుఎస్కే ప్రతినిధులు గత వారం జెనీవాలో జరిగిన బహిరంగ సభలలో చేసిన కామెంట్స్ ను తాము ఎట్టి పరిస్థితులలో పరిగణలోకి తీసుకోబోమంటూ వివరణ ఇచ్చింది యుఎన్ మానవ హక్కుల కార్యాలయం. రెండు సభలలో యుఎస్ కే ప్రతినిధులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోవచ్చు. ప్రమోషనల్ మెటీరియల్ ని పంపిణీ చేయకుండా నిరోధించడం జరిగిందని ఓహెచ్ సీహెచ్ఆర్ వెల్లడించింది.
Also Read : శాంతి ప్రక్రియకు భారత్ సిద్దం – మోదీ