Bridge Collapse : బీహార్ లో కుప్ప కూలిన భారీ వంతెన
2014లో బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
Bridge Collapse : నిన్న ఒడిశాలో రైలు ఘటన మరిచి పోక ముందే ఇవాళ బీహార్ లో ప్రాణ గండం తప్పింది. ఏకంగా నాలుగు లేన్ల భారీ వంతెన (బ్రిడ్జి) ఉన్నట్టుండి కుప్ప కూలింది(Bridge Collapse). ప్రమాదవశాత్తు ఎవరూ లేక పోవడం, వాహనాలు ప్రయాణించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఈ వంతెనను బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2014లో ప్రారంభించారు. ఈ బ్రిడ్జి సుల్తాన్ గంజ్ , ఖగారియాలను కలుపుతుంది.
అయితే ఈ భారీ వంతెన ఇంకా నిర్మాణంలో ఉండడం విశేషం. కాగా బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన సాయంత్రం పేక మేడలా కూలి పోయింది. సంవత్సరంలో ఇది రెండోసారి కూలి పోవడం విశేషం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభించ లేదు.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాలుగు లేన్ల వంతెన సడెన్ గా కూలి పోవడంపై ఆరా తీశారు సీఎం నితీశ్ కుమార్. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు . బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వంతెన కూలిన ఘటనపై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సామ్రాట్ చౌదరి నిప్పులు చెరిగారు. తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలో చోటు చేసుకున్న అంతులేని అవినీతికి ఈ కూలిన వంతెన ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.
Also Read : Elon Musk Reacts : ఏఐ మామాజాలానికి మస్క్ ఫిదా
