KISS UNESCO AWARD : ‘కళింగ’కు యునెస్కో పురస్కారం
భారత దేశంలో అత్యున్నత సంస్థగా గుర్తింపు
KISS UNESCO AWARD : ప్రతి ఏటా యునెస్కో ఇచ్చే ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ (అంతర్జాతీయ అక్షరాస్యత అవార్డు) 2022 సంవత్సరానికి గాను భారత దేశానికి చెందిన ప్రసిద్ద విద్యా సంస్థ కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు(KISS UNESCO AWARD) దక్కింది.
అక్షరాస్యతపై అత్యధిక ప్రపంచ గుర్తింపు పొందింది. $20,000 యుఎస్ డాలర్ల నగదుతో పాటు బంగారు పతకం, ప్రశంసా పత్రం అందుకుంది సంస్థ.
కోట్ డి ఐవోర్ లో యునెస్కో నిర్వహించిన గ్లోబల్ అవార్డు వేడుకలో సంస్థకు అందజేశారు యునెస్కో(KISS UNESCO AWARD) ప్రతినిధులు. దేశ నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్న కళింగ గుర్తింపు పొందింది. భారత దేశం నుండి ఐదో గ్రహీతగా, ఒడిశా నుండి ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న మొదటి, ఏకైక సంస్థగా ప్రాచుర్యం పొందింది.
భారతీయ లాభాపేక్ష లేని సంస్థలలో ఇది మూడోది. ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయ గిరిజన ఆధారిత సంస్థ. ఒక రకంగా భారత దేశానికి గర్వ కారణమని చెప్పక తప్పదు.
కళింగ సంస్థలో జరిగిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ అచ్యుత సమంతాకు అవార్డు దక్కిన విషయాన్ని ప్రకటించారు.
దినోత్సవాన్ని పురస్కరించుకుని 30,000 వేల మందితో ప్రదర్శన చేపట్టారు. ఇదిలా ఉండగా కళింగ సంస్థను ఉచిత రెసిడెన్షియల్ విద్యా సంస్థ. దీనిని ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త డాక్టర్ సమంతా స్థాపించారు.
ఇది 70,000 మంది గిరిజన పిల్లలకు చదువు చెబుతోంది. 1993లో 125 మంది విద్యార్థులతో స్థాపించబడిన ఈ సంస్థ రాను రాను భారీ ఎత్తున విస్తరించింది.
Also Read : మారనున్న పదవులు..హోదాలు