Rakesh Tikait Threatens : రాకేశ్ టికాయత్ కు బెదిరింపు కాల్
తనను..కుటుంబాన్ని చంపుతామని
Rakesh Tikait Threatens : రైతు ఉద్యమ నాయకుడు, కిసాన్ మోర్చా జాతీయ నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait) కు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. రైతు నాయకుడితో పాటు ఆయన కుటుంబాన్ని చంపుతామంటూ హెచ్చరించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఉద్యమం జరిగింది. దానికి నాయకత్వం వహించిన అగ్ర నేతల్లో రాకేశ్ టికాయత్ ఒకరు. రైతుల కోసం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసే పనిలో పడ్డారు. అంతే కాకుండా కేంద్రాన్ని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను నిలదీస్తూ వస్తున్నారు.
రైతుల పక్షాన పోరాడుతున్నారు. సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసినా నేటి వరకు ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదంటూ ఆరోపించారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా రైతు సంఘాల నిరసనల్లో ఆయన పాల్గొంటున్నారు.
రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ (Rakesh Tikait Threatens) ను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ప్రస్తుతం భారతీయ కిసాన్ యూనియన్ సభ్యుడిగా ఉన్నారు.
రైతులకు సంబంధించిన నిరసనల నుంచి వైదొలగకుంటే బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ను , ఆయన కుటుంబాన్ని నామ రూపాలు లేకుండా చేస్తామంటూ శుక్రవారం ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాకేశ్ టికాయత్ సోదరుడు, బీకేయూ చీఫ్ నరేష్ టికాయత్ కుమారుడు గౌరవ్ టికాయత్ ఫిర్యాదు చేశారని భౌరా కలాన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అక్షయ్ శర్మ తెలిపారు. విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు.
Also Read : తేజస్వి యాదవ్ కు ఈడీ షాక్