Union Budget 2023 : సీనియర్ సిటిజన్లకు ఖుష్ కబర్
కేంద్ర బడ్జెట్ 2023లో నిర్మలా
Union Budget 2023 : పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ -2023ను(Union Budget 2023) ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా బడ్జెట్ ను తయారు చేసినట్లు స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్లకు ఖుష్ కబర్ చెప్పింది.
ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో భాగంగా ఉన్న డిపాజిట్ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. గతంలో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు మాత్రమే పొదుపు చేసే అవకాశం ఉండింది. కానీ దాని పరిమితిని డబుల్ చేస్తున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్. అంతే కాకుండా మహిళలు, బాలికల కోసం కొత్త పథకాన్ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు.
వీరి కోసం సమ్మాన్ బచత్ పత్ర అనే పేరుతో కొత్త స్కీం రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ప్రవేశ పెట్టింది. ఇది రెండేళ్ల కాలం పాటు ఉంటుంది. ఇది ఎఫ్డీ రూపంలో ఉంటుంది. జమ చేసిన మొత్తాన్ని 7.5 స్థిర వడ్డీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. గరిష్ట పరిమితి రూ. 2 లక్షలుగా విధించింది. ఈసారి బడ్జెట్(Union Budget 2023) లో ఏడు ప్రధాన అంశాలపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.
దేశంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ది ఫలాలు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. మౌలిక సదుపాయాలు, పెట్టబడులు , సామర్థ్యాల వెలికితీత , స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్దితో పాటు యువ శక్తి, విత్త విధానం, ఆర్థిక విధానాన్ని బలపర్చేలా చేసిందన్నారు.
Also Read : సరైన మార్గంలో ఆర్థిక రంగం – నిర్మల