Union Budget Comment : అంకెల గారడి బతుకులు బురిడి
బడ్జెట్ లో సామాన్యులకు చోటేది
Union Budget Comment : చదువుకుంటేనే కానీ బడ్జెట్ లోని మర్మం కాదు. దానిలోని సంఖ్యలు మాత్రం గుర్తుండి పోతాయి. కానీ కోట్లాది ప్రజలను బాగు పరిచేవి కావు. కొంత మంది కోసం మాత్రమే కొనసాగుతూ ఉంది బడ్జెట్ ప్రస్థానం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న ఏకైక దేశం భారత దేశం. ఇవాళ కేంద్ర బడ్జెట్(Union Budget) ప్రవేశ పెట్టారు విత్త నిర్మలా సీతారామన్. వరుసగా ఐదోసారి ప్రవేశ పెట్టడం బడ్జెట్ ను.
అంకెల గారడీ తప్ప బతుకులను బాగు చేసే ప్రయోగాలు లేవు. సబ్సిడీలు, పథకాలు, నిధులు, కేటాయింపులు గత కొన్నేళ్లుగా..తర తరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతోంది. కానీ నేటికీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, 140 కోట్ల భారతీయుల మధ్య అంతరం, అపారమైన వ్యత్యాసం కొనసాగుతూ వస్తున్నది.
ఈ దేశంలో అపారమైన వనరులు ఉన్నాయి. కానీ నేటి వరకు వాటిని ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. సమున్నత భారతం పని చేసేందుకు, ప్రతిభను చాటేందుకు సంసిద్దమై ఉన్నది. కానీ ఈ మొత్తం మానవ సమూహాన్ని వాడుకునే సౌలభ్యం ఉన్నా ఎందుకని పాలకులు వాడుకోవడం లేదు. ఈ దేశాన్ని విద్వేషం విభజిస్తోంది.
కులం, ప్రాంతం, మతం అనే మౌఢ్యంలో కోట్లాది ప్రజలను నెట్టి వేశారు. కేవలం ప్రజల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో కొందరు మాత్రమే బిలియనీర్లుగా ఎందుకు ఉన్నారనేది ఆలోచించాలి. ఇన్ని కోట్ల మందిలో ఎందుకు ధనవంతులు కాలేక పోతున్నారో ప్రశ్నించచు కోవాలి.
భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక సూత్రాలు, ఏర్పాటు చేసుకున్న హక్కులు, బాధ్యతలు, సవరణలు ఏవీ దేశాన్ని రక్షించే స్థితిలో లేవు. ప్రజాస్వామ్యానికి మూలమైన స్తంభాలన్నీ ఇప్పుడు నిర్వీర్యంగా మారి పోయాయి. ఈ కోట్ల అంకెల్ని చూసి సంతోషం చెందితే ఎప్పుడో దేశం ప్రపంచంలో టాప్ లో ఉండేది. కానీ ఇవాళ మళ్లీ పురాతన జీవనంలోకి వెళ్లిపోతోంది.
ఇక బడ్జెట్ అనేది ప్రతి ఏటా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం దేశం తరపున ప్రవేశ పెడుతుంది. దానికి ఆమోద యోగ్యం కావాలంటే పార్లమెంట్ అనుమతి పొందాలి. ఇవాళ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్(Union Budget) లో కోట్లాది ప్రజలకు, యావత్ భారతావనికి ఆకలిని తీరుస్తున్న..ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల గురించి ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగానికి మొత్తం కేటాయింపుల్లో అతి తక్కువ.
టాప్ లో ఉన్న అమెరికాలో సైతం టెక్నాలజీ డామినేట్ చేస్తున్నా అగ్రికల్చర్ సెక్టార్ కు ప్రయారిటీ ఇస్తోంది. కానీ భారత దేశంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందన్నది వాస్తవం. ఇక సామాన్యులు..మధ్య తరగతి ప్రజల గురించి బడ్జెట్ లో ప్రస్తావన ఉంటుందని ఎలా అనుకోగలం. పాలకులు మారినా లేదా పార్టీలు మారినా ఈ దేశంలో బడ్జెట్ తీరు మారదన్నది వాస్తవం.
Also Read : నిర్మలమ్మ ఎన్నికల బడ్జెట్