Faggan Singh : స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి కామెంట్స్
ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లమని ప్రకటన
Faggan Singh : కేంద్ర ఉక్కు సహాయ శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్(Faggan Singh) గురువారం సంచలన ప్రకటన చేశారు. ఆయన ఇవాళ విశాఖను సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకణ చేస్తున్నారనే ప్రచారానికి తెర దించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ముందుకు వెళ్లబోమంటూ కుండ బద్దలు కొట్టారు. ఒక రకంగా జగన్ రెడ్డి సర్కార్ కు కేంద్రం అభయ హస్తం ఇచ్చినట్లయింది. ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా చేశారు ఒకే ఒక్క ప్రకటనతో ఫగ్గన్ సింగ్.
మరో వైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, బిడ్స్ దాఖలు విషయంలో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ప్లాంట్ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం ఎలా చేయాలనే దానిపై తాము ఫోకస్ పెట్టామన్నారు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్(Faggan Singh).
ఇందుకు సంబంధించి యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామని చెప్పారు. అయితే తెలంగాణ సర్కార్ బిడ్ లో పాల్గొనాలని సీఎం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పట్టారు. ఆయన దీనిని ఓ ఎత్తుగడగా కొట్టి పారేశారు. ముందు తన రాష్ట్రంలోని పరిశ్రమల గురించి ఆలోచించాలని సూచించారు ఫగ్గన్ సింగ్.
Also Read : ఏలేటి షాక్ బీజేపీలోకి జంప్