Jitendra Singh : శానిట‌రీ ప్యాడ్స్ పై కేంద్ర మంత్రి నిల‌దీత

మ‌హిళా పీహెచ్డీ విద్యార్థి ప్ర‌శ్న‌కు జ‌వాబు

Jitendra Singh : దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు ప్ర‌తి నెల నెలా వాడే శానిట‌రీ ప్యాడ్స్ విష‌యం ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వివ‌రించారు.

దీనిపై ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌, ప‌రిశోధ‌న జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆమె ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ డ‌బ్ల్యూవీ రామ‌న్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పీరియ‌డ్స్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

తాజాగా శానిట‌రీ ప్యాడ్స్ విష‌యంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రికి చుక్కెదురైంది. కోట్లాది మంది బాలికలు, యువ‌తులు, మహిళ‌లు నిత్యం స‌రైన నాణ్య‌మైన , సౌక‌ర్య‌వంత‌మైన శానిట‌రీ ప్యాడ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో లేవ‌ని పీహెచ్ డీ స్కాల‌ర్ ఒక‌రు ప్ర‌శ్నించారు కేంద్ర మంత్రిని.

ఇదిలా ఉండ‌గా శానిట‌రీ ప్యాడ్స్ స‌మ‌స్య ఉంద‌న్న వాస్త‌వాన్ని కేంద్ర మంత్రి అంగీక‌రించారు. ఇందుకు సంబంధించి విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని వెల్ల‌డించారు.

ఇనిస్టిట్యూట్ డైరెక్ట‌ర్ ఇన్సెంటివ్ సొల్యూష‌న్ లో ఉంద‌న్నారు. అంత‌కు ముందు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Jitendra Singh) మ‌హారాష్ట్ర లోని పూణె లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ ను సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డి వారితో చ‌ర్చించారు. సీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ ల‌లో స‌రైన శానిట‌రీ ప్యాడ్ డిస్పోజ‌ల్ మెకానిజం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

దీనికి కేంద్ర మంత్రి జవాబు ఇచ్చారు. వాస్త‌వానికి ఇది ప్ర‌ధాన స‌మ‌స్య‌. గ‌తంలో త‌క్కు మంది మ‌హిళా ప‌రిశోధ‌కులు ఉన్నార‌నేది త‌న‌కు తెలిసింద‌న్నారు. మ‌హిళా ప‌రిశోధ‌కులు పెరుగుతున్న‌ట్లు తెలిసింది. ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.

Also Read : పీరియ‌డ్స్’ పై లెవ‌నెత్తిన ప్ర‌శ్న‌లెన్నో

Leave A Reply

Your Email Id will not be published!