UAE Foreign Minister : భారత్ లో యూఏఈ విదేశాంగ మంత్రి
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో భేటీ
UAE Foreign Minister : భారత్ , యూఏఈ దేశాల మధ్య మరింత బంధం బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ యూఏఈలో పర్యటించారు. మరో వైపు యూఏఈ ఐటీ శాఖ మంత్రి ఇటీవలే కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఐటీ సదస్సులో ప్రసంగించారు.
భారత దేశం భవిష్యత్తులో ఐటీ సెక్టార్ లో టాప్ లో కొనసాగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన కంపెనీలన్నీ భారతీయ ఐటీ నిపుణులతో నిండి ఉన్నాయని కొనియాడారు. ఈ తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖ మంత్రి(UAE Foreign Minister) షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నవంబర్ 21 సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో కాలు మోపారు.
ఇప్పటికే ఆయన టూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆయన రెండు రోజుల పాటు ఇక్కడ ఉంటారు. ఇందులో భాగంగా తన సీనియర్ అధికారుల బృందంతో కలిసి వచ్చిన విదేశాంగ శాఖ మంత్రి పలు కీలక అంశాల గురించి చర్చించనున్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో .
ఇదిలా ఉండగా ఇప్పటికే భారత దేశం ప్రతిష్టాత్మకమైన జీ20 గ్రూప్ నకు సారథ్యం వహిస్తోంది. ఇందులో అమెరికా, యుకె, ఫ్రాన్స్ , ఇండోనేషియా, ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, తదితర దేశాలు ఉన్నాయి. మొత్తం మీద భారత్, యూఏఈ దేశాల మధ్య మరింతగా కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read : జీ20 సదస్సులో మోదీ పాత్ర భేష్ – యుఎస్