Chandigarh University Shut : వీడియో లీక్..యూనివర్శిటీ క్లోజ్
24 వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటన
Chandigarh University Shut : పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీ హాస్టల్ వీడియో లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. గత కొన్ని రోజుల నుంచి నిరవధికంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
వీడియో లీక్ కు కారణమైన స్టూడెంట్ తో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి కంట్రోల్ కాక పోవడంతో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కీలక ప్రకటన చేశారు.
ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు విశ్వ విద్యాలయాన్ని(Chandigarh University Shut) మూసి వేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో యూనివర్శిటీ క్యాంపస్ లో ఉన్న వారంతా పెట్టే బేడా సర్దుకుని తమ ఇళ్లకు ప్రయాణం చేస్తున్నారు.
ఇదే సమయంలో విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు గాను బాలికల హాస్టల్ వార్డెన్ రాజ్ విందర్ కౌర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది చండీగఢ్ యూనివర్శిటీ పరిపాలన శాఖ.
బాలికల హాస్టల్ నుండి అభ్యంతరకర వీడియోలు లీక్ అయ్యాయని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగారు విద్యార్థులు. పరిస్థితి అదుపు తప్పడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక ప్రకటన చేశారు.
ఈ మొత్తం ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని వెల్లడించారు. అంత వరకు విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. మరో వైపు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.
దోషులు ఎంతటి వారైనా పట్టుకుని తీరుతామన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి. వీడియో వ్యవహారం గురించి హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే దానిపై నిలదీశారు.
Also Read : యూపీలో యోగి రాచరిక పాలన – అఖిలేష్