Yogi Cabinet : 52 మందితో యూపీ కేబినెట్

ఆజాద్ అన్సారీకి మంత్రి ప‌ద‌వి

Yogi Cabinet : యూపీలో ఇవాళ సీఎంగా రెండో సారి ప్ర‌మాణ స్వీకారం చేశారు యోగి ఆదిత్యానాథ్(Yogi Cabinet). ల‌క్నోలో జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. ఎవ‌రికి కేబినెట లో చోటు ద‌క్కుతుంద‌నే దానిపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు ఈరోజుతో పుల్ స్టాప్ ప‌డింది.

అశేష జ‌న‌వాహిని మ‌ధ్య అతిర‌థ మ‌హారథుల స‌మ‌క్షంలో యోగి రాజ‌యోగిగా న‌డుచుకుంటూ వ‌చ్చారు. రెండో సారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం యూపీ చ‌రిత్ర‌లో ఓ రికార్డు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ప్ర‌ముఖులు, సినీ రంగానికి చెందిన వారు ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రు కావ‌డం హైలెట్ గా నిలిచింది.

403 సీట్లు ఉన్న రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ 273 సీట్లు గెలుచుకుంది. ఈసారి క‌ష్ట‌మ‌ని అనుకున్న ఆ పార్టీకి తానే ముందుండి న‌డిపించాడు యోగి ఆదిత్యానాథ్(Yogi Cabinet). నేర‌స్తుల పాలిట సింహ స్వ‌ప్నంగా మారాడు.

బీజేపీ తీసుకున్న నిర్ణ‌యాల ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ యోగి మీదున్న భ‌రోసాతో జ‌నం మ‌రోసారి ప‌ట్టం క‌ట్టారు. ఇక ఇవాళ జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో ఏకంగా 52 మందికి కేబినెట్ లో చోటు ద‌క్కింది.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది జంబో కేబినెట్ గా పేర్కొన‌డంలో త‌ప్పు లేదు. అన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, ప్రాంతాల‌కు స‌మ ప్రాధాన్య‌త ఇచ్చేందుకు ట్రై చేశారు యోగి.

విశేషం ఏమిటంటే పార్టీకి విధేయుడిగా ఉంటూ వ‌చ్చిన మొహ‌సిన్ ర‌జా స్థానంలో డానిష్ ఆజాద్ అన్సారీకి చోటు ద‌క్కింది. ఇదిలా ఉండ‌గా గ‌త కేబినెట్ లో మంత్రులుగా ఉన్న చాలా మంది పెద్ద‌ల‌ను తొల‌గించారు.

శ్రీ‌కాంత్ శ‌ర్మ‌, స‌తీష్ మ‌హానా, మ‌హేంద‌ర్ సింగ్ , సిద్దార్థ్ నాథ్ సింగ్ , నీల‌కాంత్ తివారీ , ర‌జా ఈసారి కేబినెట్ కు దూర‌మ‌య్యారు.

Also Read : చైనాతో చ‌ర్చ‌లు ఆశాజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!