Yogi Adityanath : యూపీలో రెడ్ అలర్ట్ – సీఎం
ఆటంకం కలిగిస్తే ఊరుకోవద్దు
Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్ లో కరడు గట్టిన నేరస్థులుగా పేరొందిన మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , సోదరుడు అష్రఫ్ అహ్మద్ లు ప్రయాగ్ రాజ్ లో దుండగుల చేతుల్లో కాల్చి చంపబడ్డారు. పోలీసుల సమక్షంలోనే హతం కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు పోలీసులతో సమీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించాలని, ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా ఊరుకోవద్దంటూ స్పష్టం చేశారు. ఏ మాత్రం గీత దాటినా ఉపేక్షించ వద్దని ఆదేశించారు. ఒకవేళ కావాలని ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలకు ప్రయత్నం చేస్తే కాల్చి పారేయాలంటూ కఠినంగా స్పష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath).
ఈ ఘటనపై పుకార్లను పట్టించు కోవద్దంటూ ప్రజలను కోరారు. అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ గుంపులుగా ఉండ కూడదని పేర్కొన్నారు సీఎం. గ్యాంగ్ స్టర్లు కాల్పులకు గురి కావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించాలని ఆదేశించారు యోగి ఆదిత్యానాథ్. శనివారం అర్ధరాత్రి కీలక సమావేశం ఏర్పాటు చేశారు సీఎం. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం.
Also Read : బీజీపీకి మాజీ సీఎం షట్టర్ గుడ్ బై