CM Yogi Hawa : యోగి హవా ఎస్పీ కోటలో బీజేపీ పాగా
విక్టరీ సింబల్ తో యూపీ ముఖ్యమంత్రి
CM Yogi Hawa : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండో సారి భారతీయ జనతా పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చారు డైనమిక్ లీడర్ గా పేరొందిన సీఎం యోగి ఆదిత్యానాథ్. తాజాగా సమాజ్ వాది పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు.
ఆ పార్టీకి పట్టున్న రాంపూర్ , అజంగఢ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ బావుటా ఎగుర వేసింది. గత కొన్నేళ్లుగా
సమాజ్ వాది పార్టీకి ఈ రెండు స్థానాల్లో మంచి పట్టు ఉంది. కానీ ఆ చరిత్రను తిరగ రాశారు యోగి ఆదిత్యానాథ్(CM Yogi Hawa) .
ఇక్కడ లోక్ సభ స్థానంకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ . ఈ మేరకు ఆయన మొదటిసారిగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
అసెంబ్లీ బరిలో నిలిచి గెలుపొందారు. దీంతో అజంగఢ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంతో పాటు రాంపూర్ నియోజకవర్గంలో కూడా కాషాయ జెండా ఎగిరేలా చేశాడు సీఎం.
ఇదంతా యోగి ఆదిత్యానాథ్ వల్లే సాధ్యమైందన్నది వాస్తవం. ఇప్పటికే నేరస్తులకు అడ్డాగా మారిన యూపీలో నేరం చేసేందుకు భయానికి గురవుతున్నారు గ్యాంగ్ స్టర్ లు.
ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో రాంపూర్ , అజంగఢ్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ విజయ బావుటా ఎగుర వేసింది. ఎస్పీ ఆధీనంలో
ఉన్న ఈ రెండింట్లో కాషాయ జెండా ఎగుర వేసింది.
ఇక ఎస్పీ కంచుకోటగా ఉన్న అజంగఢ్ లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ పై
8, 679 ఓట్లతో గెలుపొందారు.
ఇక రాంపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఘ్యాన్ శ్యామ్ సింగ్ లోధి ఎస్పీ అభ్యర్థి మొహమ్మద్ అసీమ్ రాజాను 42,000 వేల
ఓట్ల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించారు.
ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Hawa) ఇది చారిత్రక విజయమని పేర్కొన్నారు.
Also Read : చిన్నారి నమస్కారం మోదీ సంతోషం