UP Ministers : పాపం పుణ్యం లెక్కించ బడుతుంది
యూపీ మంత్రుల షాకింగ్ కామెంట్స్
UP Ministers : యూపీలో గ్యాంగ్ స్టర్స్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , సోదరుడు అష్రఫ్ అహ్మద్ లు ప్రయాగ్ రాజ్ లో మీడియాతో మాట్లాడుతుండగానే దుండగుల చేతుల్లో కాల్చి చంపబడ్డారు. హతమైన అతిక్ అహ్మద్ మాజీ ఎంపీగా ఉన్నారు.
సమాజ్ వాది పార్టీ, బీఎస్పీలో కీలకంగా ఉన్నాడు. ఒక రకంగా ఆ రెండు పార్టీలు అతడిని పెంచి పోషించాయి. నేర సామ్రాజ్యానికి రాజ్ గా ఉన్నాడు అతిక్ అహ్మద్. రెండు రోజుల కిందట న్యాయవాది రాజ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతిక్ అహ్మద్ తనయుడు అసద్ అహ్మద్ , సహాయకుడు గులాంలు యూపీలోని ఝాన్సీలో పోలీసుల ఎన్ కౌంటర్ లో ఖతమయ్యారు.
తాజాగా ప్రయాగ్ రాజ్ కాల్పుల ఘటన కలకలం రేపింది. యావత్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. ఎంఐఎం చీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(UP Ministers ) నిప్పులు చెరిగారు. యూపీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని ఆరోపించారు. ఖాకీల సమక్షంలో ఎలా చంపేస్తారంటూ ప్రశ్నించారు ఓవైసీ. చంపే సమయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు యూపీ మంత్రులు సురేష్ కుమార్ ఖన్నా , స్వతంత్ర దేవ్ సింగ్ . ఒకరు ఈ కాల్చివేత ఘటనను ప్రకృతి నిర్ణయంగా పేర్కొంటే మరొకరు పాపం పుణ్యం ఈ కాలంలోనే లెక్కించ బడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రులు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : ఎన్ కౌంటర్ల వేట గుండెల్లో దడ