Upendra Kushwaha Nitish : నితీశ్ పై ఉపేంద్ర కుష్వాహా కన్నెర్ర
ఆర్జేడీతో ఒప్పందంపై చెప్పాలి
Upendra Kushwaha Nitish : బీహార్ లో రాజకీయ వివాదం ముదిరింది. మిత్రపక్షంతో కలత చెందిన నితీష్ కుమార్ పార్టీకి చెందిన నాయకుడు తేజస్వి యాదవ్ చేసిన వ్యక్తిగత అవమానాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఉపేంద్ర కుష్వాహా.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిత్రపక్షమైన ఆర్జేడీతో బీహార్ సీఎం కుదుర్చుకున్న ఒప్పందంపై నిజా నిజాలు తెలసు కోవాలని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) తిరుగుబాటు పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా(Upendra Kushwaha) పేర్కొన్నారు.
పాట్నా లోని తన అధికారిక నివాసంలో ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడైన కుష్వాహా సీఎం నితీశ్ కుమార్ వైదొలగాలని కోరుతున్నా తాను పార్టీ నుండి వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. మూడుసార్లు నేను పార్టీని విడిచి పెట్టాను. నా స్వంత కోరికతో తిరిగి వచ్చాను.
నా మొదటి పునరాగమనం 2009లో జరిగింది. 2021లో తిరిగి నన్ను పార్టీలో చేరమని సీఎం నితీశ్ కుమార్ కోరారని అన్నారు. రెండు సంవత్సరాల కిందట ఆర్ఎల్ఎస్పీ ని జేడీయూలో విలీనం చేశారు. మంత్రిగా కూడా గతంలో పని చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై తనకు ఉన్న వేదనను కూడా కుష్వాహా పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ వేదికపై తన ఆందోళనలను లేవనెత్తేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు ఉపేంద్ర కుష్వాహా. ఇదిలా ఉండగా ఉపేంద్ర చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి బీహార్ లో.
Also Read : ‘అదానీ’ పై సెబీ, ఆర్బీఐ విచారించాలి