Eric Garcetti Mk Stalin : స్టాలిన్ తో యుఎస్ రాయ‌బారి భేటీ

సీఎంతో ఎరిక్ గార్సెట్టి స‌మావేశం

Eric Garcetti Mk Stalin : అమెరికా రాయ‌బారి ఎరిక్ గార్సెట్టి భార‌త దేశ ప‌ర్య‌ట‌నలో బిజీ బిజీగా ఉన్నారు. అమెరికా ప్ర‌భుత్వంలో ముఖ్యంగా జోసెఫ్ డైబెన్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందారు. ఆయ‌న టూర్ లో భాగంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు.

ఇదే స‌మ‌యంలో శుక్ర‌వారం యుఎస్ రాయ‌బారి ఎర్సిక్ గార్సెట్టి(Eric Garcetti) త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు స్టాలిన్. అనంత‌రం సీఎం ఛాంబ‌ర్ లో స్టాలిన్ తో పాటు ఎరిక్ గార్సెట్టి బృందంతో చ‌ర్చించారు. వీరి మ‌ధ్య గంట‌కు పైగా స‌మావేశం కావ‌డం విశేషం.

వివిధ అంశాల‌పై ఎంకే స్టాలిన్, ఎర్సిక్ గార్సెట్టి చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా సీఎంతో భేటీ కావ‌డం ప‌ట్ల చాలా సంతోషం క‌లిగించింద‌ని పేర్కొన్నారు స్వ‌యంగా యుఎస్ఏ రాయ‌బారి. ఇందుకు సంబంధించిన స‌మాచారాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. విస్తృత‌మైన అంశాల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించ‌డం ఆనందం క‌లిగించింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా గ‌త కొన్నేళ్లుగా భార‌త దేశం, అమెరికా దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు కొన‌సాగుతూ వ‌చ్చాయ‌ని తెలిపారు. కాగా ఈ నెల‌లో ప్ర‌ధాన మంత్రి యుఎస్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. స్వ‌యంగా బైడెన్ ఆయ‌న‌ను ఆహ్వానించ‌డం విశేషం. ఇందులో భాగంగానే ఎరిక్ గార్సెట్టి ప‌ర్య‌టించారు.

Also Read : GFST Summit : 17న జీఎఫ్ఎస్టీ ఆధ్వ‌ర్యంలో స‌ద‌స్సు

Leave A Reply

Your Email Id will not be published!