LIoyd Austin Arrive : భార‌త్ కు చేరుకున్న లాయ‌డ్ ఆస్టిన్

రాజ్ నాథ్ సింగ్ తో ర‌క్ష‌ణ శాఖ మంత్రి భేటీ

Lloyd Austin Arrive : అమెరికా ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి లాయ‌డ్ ఆస్టిన్ భార‌త్ కు చేరుకున్నారు(Lloyd Austin Arrive). త‌న భార‌త పర్య‌ట‌న‌లో భాగంగా ఆస్టిన్ కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వాషింగ్ట‌న్ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రెండు వారాల ముందు సెక్ర‌ట‌రీ ఆస్టిన్ రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా ఇరు ప‌క్షాలు ఆమెరికా, భార‌త్ ప్ర‌పంచ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని విస్త‌రించే కార్య‌క్ర‌మాల‌ను ఆవిష్క‌రించాల‌ని భావిస్తున్నారు.

ద్వైపాక్షిక ర‌క్ష‌ణ స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే మార్గాల‌ను అన్వేషించేందుకు ముఖ్యంగా సైనిక హార్డ్ వేర్ స‌హ అభివృద్ది కోసం కీల‌క‌మైన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని బ‌దిలీ చేసే మార్గాల‌ను అన్వేషించేందుకు రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం అమెరికా ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఆస్టిన్ భారత దేశానికి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డం గురించి చ‌ర్చ‌ల కోసం ముఖ్య నేల‌ను క‌లిసేందుకు భార‌త్ కు వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు లాయ‌డ్ ఆస్టిన్. న్యూలో దిగిన కొద్ది సేప‌టికే యుఎస్ ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండ‌గా ఇరు దేశాల ర‌క్ష‌ణ శాఖ‌ల మంత్రుల మ‌ధ్య ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

కాగా జూన్ 2016లో అమెరికా భార‌త దేశాన్ని ప్ర‌ధాన ర‌క్ష‌ణ భాగ‌స్వామిగా నియ‌మించింది. ఇది క్లిష్ట‌మైన సైనిక ప‌రిక‌రాలు, సాంకేతిక‌త‌ను పంచు కోవ‌డానికి మార్గం సుగ‌మం చేసింది. మ‌రో వైపు ఒడిశాలో జ‌రిగిన భారీ రైలు ప్ర‌మాద ఘ‌ట‌నపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు ర‌క్ష‌ణ శాఖ మంత్రి లాయ‌డ్ ఆస్టిన్.

Also Read : AI Effect US : ఏఐ ఎఫెక్ట్ యుఎస్ లో జాబ్స్ క‌ట్

 

 

Leave A Reply

Your Email Id will not be published!