US VISA Embassy : యుఎస్ వెళ్లాలంటే 500 రోజులు ఆగాల్సిందే
వీసా అపాయింట్ మెంట్ కు తప్పని నిరీక్షణ
US VISA Embassy : ప్రపంచంలో అత్యధికంగా భారతీయులు ఎక్కువగా ప్రిఫర్ చేసే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్కటే అమెరికా. మిగతావి తర్వాత. చదువుకునేందుకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది.
ఇక జాబ్ కోసం వెళ్లే వాళ్లు. ఇప్పటికే టెక్, లాజిస్టిక్ తదితర కంపెనీల్లో పని చేసే వారి ప్రయారిటీ కూడా అమెరికానే. మరి ఆ దేశం వెళ్లాలంటే పాస్ పోర్ట్ ఉంటే సరిపోదు.
వీసా కూడా మంజూరు కావాలి. ఆ తర్వాత ఇంటర్వూ ప్రాసెస్. విచిత్రం ఏమిటంటే వీసా అపాయింట్ మెంట్ ల కోసం కనీసం 500 రోజులు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదే విషయాన్ని యుఎస్ ఎంబసీ(US VISA Embassy) అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. సగటు నిరీక్షణ సమయం సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా గుర్తించ బడింది.
దీంతో ఇప్పటికే అమెరికా వెళ్లాలని అనుకునే కలల రాకుమారులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇక విజిటర్ వీసా పొందేందుకు 2024 వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు గనుక దరఖాస్తు చేసుకుంటే ఏప్రిల్ దాకా ఆగాల్సిందేనన్న మాట. న్యూఢిల్లీలోని యుఎస్ కాన్సులేట్ లో వీసా అపాయింట్ మెంట్ విజిటర్
వీసాలకు 522 రోజులు , విద్యార్థి వీసాల కోసం 471 రోజులు పట్టనుంది.
ఇక ఒకవేళ లొకేషన్ ను ముంబైకి మార్చినట్లయితే 517 రోజులు , విద్యార్థి వీసా కోసం 10 రోజులు, ఇతర వలసేతర వీసాల కోసం వేచి ఉండే సమయం
ఢిల్లీలో 198 రోజులు, ముంబైలో 72 రోజులు పడుతుంది.
ఇక చెన్నై విషయానికి వస్తే సందర్శకుల వీసా కోసం వేచి ఉండే సమయం సందర్శకుల వీసా కోసం 557 రోజులు , ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్
వీసాల కోసం 185 రోజులు ఉండాల్సి వస్తుంది.
ఇక హైదరాబాద్ ఎంబ సీ నుండి దరఖాస్తు చేసుకునే వారు విజిటర్ వీసా పొందేందుకు 518 రోజులు వేచి ఉండాల్సి ఉంటుందని విదేశాంగ
శాఖ వెబ్ సైట్ వెల్లడించింది.
కరోనా సమయంలో వీసా ప్రాసెస్ కోసం ఇబ్బంది పడ్డాం. ప్రస్తుతం వీసా ప్రాసెసింగ్ పుంజుకుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.
Also Read : గ్రీన్ కార్డు కోసం ‘గోటబయ’ దరఖాస్తు