US VISA : భారతీయులకు అమెరికా వెళ్లడం అనేది హాబీగా మారి పోయింది. భారీ ఎత్తున అవకాశాలు లభించడం, ఆశించిన జీతం రావడం, కోరుకున్న సౌకర్యాలు పొందడం వల్ల యుఎస్ కు క్యూ కట్టారు. ఇదిలా ఉండగా కరోనా పేరుతో వీసాల జారీ పెద్ద ఎత్తున ఆగి పోయింది.
ఎక్కువగా చదువుకునే వారితో పాటు వివిధ కంపెనీలలో పని చేయాలని అనుకుంటున్న వారికి వీసాల సమస్య ప్రధాన అవరోధంగా మారింది. ఇప్పటికే భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో సమావేశం అయ్యారు.
త్వరితగతిన వీసాల జారీ ప్రక్రియ చేయాలని కోరారు. ఇందులో భాగంగా అమెరికాకు వీసాలు భారంగా మారాయి. యుఎస్ కాన్సులర్ వ్యవహారాల మంత్రి కౌన్సెలరర్ డాన్ హెప్లిన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బి వీసాల(US VISA) కోసం ఒక లక్ష డ్రాప్ బాక్స్ అపాయింట్ మెంట్ లను తెరిచామన్నారు.
26 వేల స్లాట్లు ఇంకా తెరిచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా హెచ్ -1బి , బీ1, బీ2 డ్రాప్ బాక్స్ కేసుల వెయిటింగ్ పీరియడ్ ను తొమ్మిది నెలలకు తగ్గించ గలిగామని మంత్రి కౌన్సెలర్ వెల్లడించారు.
మే 2023 నాటికి హెచ్ -1బి కేసుల వెయిటింగ్ టైమ్ ను 9 నుంచి 5 నెలలకు పెంచే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు. దానిని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
హెచ్ 1బి డ్రాప్ బాక్స్ అప్లికేషన్స్ కోసం 1,28,000 మంది దరఖాస్తుదారులు క్యూలో ఉన్నారు. 2021-22 యుఎస్ లో చదువుతున్న స్టూడెంట్స్ సంఖ్య 19 శాతం పెరిగిందని డాన్ హెప్లిన్ తెలిపారు.
Also Read : ఐక్యరాజ్య సమితిలో ‘గాంధీ’ విగ్రహం