US VISA Late : వీసా కావాలంటే ఇంకా ఆగాల్సిందే

ప్ర‌వాస భార‌తీయుల ఆశ‌ల‌పై నీళ్లు

US VISA Late : అమెరికా వెళ్లాలి..డాల‌ర్లు సంపాదించాలి. అవ‌స‌ర‌మైనంత మేర ఎంజాయ్ చేయాల‌ని అనుకునే వాళ్ల‌ల్లో అత్య‌ధిక శాతం భార‌తీయులై ఉంటారు. ప్ర‌ధానంగా ఏపీ, తెలంగాణ‌కు చెందిన తెలుగు వారు మ‌రీ ఎక్కువ‌. ఇక అమెరికా దేశ ఉపాధ్య‌క్షురాలు ప్ర‌వాస భార‌తీయురాలు. అంతేనా దిగ్గ‌జ కంపెనీల‌కు సంబంధించి టాప్ పొజిష‌న్ల‌లో కొలువు తీరిన వారంతా మ‌నోళ్లే.

ఇది ప‌క్క‌న పెడితే క‌రోనా దెబ్బ‌కు ఈ మ‌ధ్య‌న వీసా(US VISA Late) మంజూరీలో జాప్యం ఏర్ప‌డింది. దీని గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌చ్చింది భార‌త దేశ విదేశాంగ శాఖ‌. గ‌తంలో నెల లేదా రెండు నెలల లోపే వీసాలు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రోజులు నెల‌లు పోయాయి. ఏడాది కాలం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

ప్ర‌ధానంగా జాబ్స్ కోసం వెళ్లే వాళ్లు, కంపెనీల త‌ర‌పు నుంచి అమెరికాకు వెళ్లాల‌ని అనుకునే వాళ్లు, పై చ‌దువుల కోసం వెళ్లే విద్యార్థులు నిరీక్షించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనికంత‌టికీ అమెరికా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మంటూ పెద్ద ఎత్తున ప్ర‌వాస భార‌తీయులు మండి ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఇదే విష‌యాన్ని గ‌మ‌నించిన భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ అమెరికా వెళ్లిన సంద‌ర్భంగా ఆ దేశ విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి ఆంటోనీ బ్లింకెన్ తో ప్ర‌త్యేకంగా స‌మావేశమై వీసాల(US VISA Late) మంజూరీలో జాప్యంపై ప్ర‌స్తావించారు. ఆ త‌ర్వాత ఆయ‌న హామీ కూడా ఇచ్చారు.

త్వ‌ర‌లోనే వీసాల జారీ ప్ర‌క్రియ వేగ‌వంతం చేస్తామ‌ని. కానీ అమెరికా వీసాల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లో చూస్తే ఇంకా 1,000 రోజులు ప‌ట్టేలా ఉంది. అంటే మూడేళ్లు ఆగాల్సి వ‌స్తుంద‌న్న‌మాట‌. దీనిపై భార‌త ప్ర‌భుత్వం మ‌రోసారి ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Also Read : యుఎస్ వాల్ మార్ట్ లో కాల్పుల మోత

Leave A Reply

Your Email Id will not be published!