Uttam Bhatti : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక మిగిలింది ప్రభుత్వం ఏర్పాటు చేయడమే. ఇప్పటికే సీఎల్పీ కీలక సమావేశం జరిగింది. పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలతో అభిప్రాయాలను తీసుకున్నారు. చివరకు ఏక వాక్య తీర్మానం చేశారు. ఆ వెంటనే డీకే శివకుమార్ సదరు తీర్మానం వివరాలను ఏఐసీసీ హై కమాండ్ కు పంపించారు. సమావేశం ముగిశాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.
Uttam Bhatti Viral
సీఎల్పీ చీఫ్ ను ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రకటిస్తారని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఎవరు సీఎం ఎవరు అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ముఖ్యమంత్రి రేసులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డితో పాటు మధిర నుంచి గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఉమ్మడి నల్లగొండకు చెందిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆందోల్ నుంచి గెలుపొందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ ఉన్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు టాక్. ఇక సీఎం పోస్టు తమకు కావాలని కోరేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
Also Read : Tirumala Rush : శ్రీవారి ఆదాయం రూ. 3.42 కోట్లు