Uttam Kumar Reddy : ద‌ళిత బంధుపై ఈసీకి ఫిర్యాదు

లేఖ రాసిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy : హైద‌రాబాద్ – భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఈ మేర‌కు స‌ర్కార్ నూత‌న ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. ద‌ళిత బంధు పేరుతో ల‌బ్దిదారుల‌కు నేరుగా ల‌బ్ది చేకూర్చే ప్లాన్ చేసింది. ఇప్ప‌టికే భారీ ఎత్తున నిధుల‌ను మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి స‌ర్కార్ ప్లాన్ పై నీళ్లు చ‌ల్లింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ మేర‌కు య‌ధావిధిగా ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది.

Uttam Kumar Reddy Comments Viral

దీంతో ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌కూడ‌దంటూ టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) షాక్ ఇచ్చారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళిత బంధు ప‌థ‌కం త‌క్ష‌ణం నిలిపి వేయాల‌ని, దాని ద్వారా నిధుల మంజూరు చేయ‌డం చ‌ట్ట విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు కేంద్ర , రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాల‌కు ఫిర్యాదు చేశారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ఇందులో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ద‌ళిత బంధు పేరుతో ఓటర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు దీనిని తీసుకు వ‌చ్చారంటూ ఆరోపించారు. వెంట‌నే నిలిపి వేయాల‌ని కోరుతూ ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని లేఖ‌లో కోరారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఎన్నిక‌ల సంఘం స్పందించింది. ద‌ళిత బంధుపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు జారీ చేసిన‌ట్లు స‌మాచారం.

Also Read : Congress Tickets Row : కాంగ్రెస్ లో వార‌సుల గొడ‌వ

Leave A Reply

Your Email Id will not be published!