Uttarakhand Agnipath : ఉత్త‌రాఖండ్ లో అగ్నిప‌థ్ పై ఆగ్ర‌హం

400 మంది నిర‌స‌న‌కారుల‌పై కేసులు

Uttarakhand Agnipath : కేంద్రం తీసుకు వ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీం అగ్గిని రాజేసింది. బీహార్ మొద‌లుకుని అన్ని రాష్ట్రాల‌కు పాకింది. తెలంగాణ‌లో పోలీసు కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా ప‌లువురికి గాయాల‌య్య‌యి.

ప్ర‌భుత్వ ఆస్తుల విధ్వంసం కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఈ త‌రుణంలో ఆదివారం ఉత్త‌రాఖండ్ లో అగ్నిప‌థ్(Uttarakhand Agnipath) కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. దీంతో 400 మంది నిర‌స‌కారుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా 10 జోన్లు, 21 సెక్టార్లుగా విభ‌జించ‌నున్న‌ట్లు డెహ్రాడూన్ లోని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ప్ర‌క‌టించారు. దీంతో విష‌యం తెలుసుకున్న నిర‌స‌న‌కారులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

హింసాత్మ‌కంగా మారింది. పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ప‌లు ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌డంతో కేసులు న‌మోదు చేశారు. హ‌ల్దాన‌లో,

టోకోనియా చౌరాహా వ‌ద్ద నైనిటాల్ జాతీయ ర‌హ‌దారిపై హింసాత్మ‌క నిర‌స‌న చేప‌ట్టినందుకు కేసులు న‌మోద‌య్యాయి.

దీని వ‌ల్ల భారీగా ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. అంబులెన్స్ ల‌కు కూడా దారి ఇవ్వ‌లేద‌ని పోలీసులు ఆరోపించారు. నిర‌స‌న‌కారులు రెచ్చి పోవ‌డంతో ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది.

హ‌ల్ద్వానీ సిటీ మేజిస్ట్రేట్ రిచా సింగ్ , ముగ్గురు పోలీస్ సిబ్బందికి గాయాలైన‌ట్లు నైనిటాల్ సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంక‌జ్ భ‌ట్ తెలిపారు. 147, 149, 332, 342, 353, 427 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు.

చంపావ‌త్ జిల్లాలోని త‌న‌క్ పూర్ ప్రాంతంలో పిలిభిత్ చుంగి జాతీయ ర‌హ‌దారిపై కూడా అడ్డుకున్నార‌ని తెలిపారు. 147, 341 సెక్ష‌న్ల కింద కేసు

న‌మోదు చేశామ‌ని చెప్పారు.

ప‌రిస్థితి ప్ర‌స్తుతం అదుపులో ఉంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా హింస‌కు యువ‌త పాల్ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు ఉత్త‌రాఖండ్(Uttarakhand Agnipath) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్.

Also Read : అపోహ‌లు వీడండి ‘అగ్నిప‌థ్’ లో చేరండి

Leave A Reply

Your Email Id will not be published!