Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో 46 మంది సేఫ్ ! నలుగురు మృతి !

ఉత్తరాఖండ్ ఘటనలో 46 మంది సేఫ్ ! నలుగురు మృతి !

Uttarakhand : ఉత్తరాఖండ్‌ లోని మంచు చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్‌ క్షేత్రానికి సమీపంలో ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో బోర్డర్ రోడ్స్ ఆర్గనేజేషన్ (బీఆర్‌ఓ) కు చెందిన మొత్తం 55 మంది కార్మికులు మంచు చరియలు క్రింద చిక్కుకున్నారు. దీనితో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి సహాయక చర్యలు ప్రారంభించాయి.

మంచు చరియలు క్రింద చిక్కుకున్న వారిలో ఇంతవరకు మొత్తం యాభై మందిని వెలికి తీయగా మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంచు వర్షంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నిన్న 33 మందిని… ఇవాళ మరో 17 మందిని భారత సైన్యం రక్షించింది. అయితే మంచు చరియలు క్రింద చిక్కుకున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటీన హెలికాఫ్టర్ ద్వారా జోషిమఠ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్ అందిస్తున్నారు. అయితే వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని… ఇంకా ఐదుగురిని కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేసారు.

Uttarakhand Incident Updates

ఈ సందర్భంగా ఉత్తరాఖండ్(Uttarakhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్(Pushkar Singh Dhami) థామి మాట్లాడుతూ… మొత్తం 50 మందిని సహాయక బృందాలు రక్షించాయని చెప్పారు. జాడ తెలియకుండా పోయిన ఐదుగురిని జాట కూడా కనిపెట్టే చర్యలు చురుగ్గా సాగుతున్నట్టు తెలిపారు. తీవ్రంగా మంచు పడుతుండటంతో సహాయక కార్యక్రమాలకు అవాంతరాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ధారాపాతంగా కురుస్తున్న మంచుతో ఐదు బ్లాక్‌లలో విద్యుత్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని, సాధ్యమైనంత త్వరగా వీటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. సహాయక చర్యలకు 200 మంది సిబ్బందిని మోహరించామని, గాయపడిన 50 మంది కార్మికులను చికిత్స కోసం జోషిమఠ్ తరలించామని చెప్పారు. సహాయక కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం సమీక్షించారని, ఎలాంటి సాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారని తెలిపారు.

ఏటా శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడటం సర్వ సాధారణం. ఇలా విరిగిపడిన మంచు చరియలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసి రోడ్లను పునరుద్ధరించడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనేజేషన్ పనిచేస్తుంది. దీనిలో భాగంగా భారత్‌-టిబెట్‌ సరిహద్దులో మన దేశానికి చెందిన చివరి గ్రామం అయినమనా గ్రామం వద్ద జాతీయరహదారిపై భారీగా పేరుకుపోయిన మంచుమేటలను తొలగించేందుకు బిఆర్ఓ సిబ్బంది తాత్కాలికంగా నిర్మించిన స్థావరాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

ఈ క్రమంలో… వారి స్థావరాలపై శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. ఎనిమిది కంటైనర్‌ లతో పాటు ఒక షెడ్డూలో వాళ్లను మంచు చరియలు కప్పేశాయి.ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకవైపు వర్షం… మరోవైపు అడుగుల మేరలో పేరుకుపోయిన మంచులో మరికొన్ని ఏజెన్సీల సాయంతో సైన్యం సహాయక చర్యలు కొనసాగించింది. వీళ్లలో కొందరు ఉత్తరాఖండ్‌(Uttarakhand) నుంచి ఉండగా, చాలామంది బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్ము కశ్మీర్‌, ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు ఉన్నారు.

Also Read : Elon Musk: 14వ బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌

Leave A Reply

Your Email Id will not be published!