V Srinivas Goud : శ్రీ‌నివాస్ గౌడ్ డ్యాన్స్ అదుర్స్

బోనాల పండుగ‌లో మంత్రి సూప‌ర్

V Srinivas Goud : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖా మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ హాట్ టాపిక్ గా మారారు. బోనాల పండుగ‌లో ఆయ‌న పాల్గొన్నారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హ‌బూబ‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ట్ట‌ణంలో కొత్త గంజికి మంగ‌ళ‌వారం వెళ్లారు. అక్క‌డ కొలువు తీరిన పోచ‌మ్మ దేవాల‌యంలో పూజ‌లు చేశారు. బోనాల పండుగ ఉత్స‌వాల‌కు హాజ‌రై భ‌క్తుల‌ను ఉత్సాహ ప‌రిచారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులు, అభిమానులు, స్థానికుల‌తో క‌లిసి డ్యాన్స్ చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ కు చెందిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

మంత్రిగా ఇటీవ‌ల సాంస్కృతిక ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. తెలంగాణ ఏర్ప‌డి 10 ఏళ్ల‌వుతున్న సంద‌ర్భంగా పెద్ద ఎత్తున స‌క్సెస్ చేశారు. తాజాగా ప్ర‌తి ఏటా బోనాల‌ను ఘ‌గ‌నంగా నిర్వ‌హించేలా చేయ‌డంలో ముందంజ‌లో ఉన్నారు విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్(V Srinivas Goud). ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉండాల్సిందే.

మందీ మార్బ‌లంతో పాటు అనుచ‌ర‌గ‌ణం ఈసారి ఫుల్ జోష్ తో బోనాల పండుగ‌లో పాల్గొన‌డం విశేషం. ఇటీవ‌లే ద‌క్షిణ కొరియాకు వెళ్లి వ‌చ్చారు. మ‌న్యంకొండ ఆల‌యాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా చేయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. అందుకు ప్లాన్ కూడా రెడీ చేశారు.

Also Read : Alla Ramakrishna Reddy : కాళ్లు క‌డిగిన ఎమ్మెల్యేకు హ్యాట్సాఫ్

 

Leave A Reply

Your Email Id will not be published!