Mansukh Mandaviya : 150 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ – మన్సుఖ్
సంక్షోభ సమయంలో భారత్ సాయం
Mansukh Mandaviya Vaccine : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్ట కాలంలో ప్రపంచంలోని 150 దేశాలకు వ్యాక్సిన్లు, మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ధరలను పెంచకుండా, మందుల నాణ్యతలో రాజీ పడకుండా పంపించామన్నారు కేంద్ర మంత్రి. ప్రపంచ వ్యాక్సిన్ అవసరాలలో 65 శాతం భారత దేశం తీరుస్తుందన్నారు. ఢిల్లీలో హెల్త్ టెక్నాలజీ అసెస్మెంట్ పై అంతర్జాతీయ సింపోజియం ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో చాలా దేశాలు తీవ్ర ఇబ్బంది పడ్డాయని తెలిపారు మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya). వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు , మందుల రూపంలో 150కి పైగా ప్రభావిత దేశాలకు భారత దేశం మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల 26వ కాన్ఫరెన్స్ చేపట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్ కీలక ప్రసంగం చేశారు.
ఇక భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 123 దేశాలకు చిక్కుకు పోయిన విదేశీ పౌరులను తరలించేందుకు భారత దేశం సులభ తరం చేసిందన్నారు. ఇవాళ ప్రపంచం లోని ఏదైనా దేశం సరసమైన మందులను అందజేస్తోందంటే అది భారత దేశమే అని పేర్కొన్నారు మన్సుఖ్ మాండవీయా(Mansukh Mandaviya Vaccine). ఇందుకు సంబంధించి వ్యాక్సిన్ మైత్రి పేరుతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
డిసెంబర్ 2022 మొదటి వారం నాటికి భారత దేశం 101 దేశాలు , రెండు యుఎన్ సంస్థలకు కోవిడ్ 19 282 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోస్ లను సరఫరా చేసిందన్నారు.
Also Read : మహిళల సహకారం దేశాభివృద్ధికి సోపానం