Vande Bharat Train : తెలంగాణకు రాని వందే భారత్ రైలు
ఎందుకని ఈ వివక్ష అంటున్న టీఆర్ఎస్
Vande Bharat Train : నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. కొత్త పథకాలు ప్రకటించారు వస్తూనే. అందులో భాగంగా రైళ్ల చరిత్రలోనే అత్యంత విప్లవాత్మక మార్పుగా వందే భారత్ రైళ్లు(Vande Bharat Train) అని ప్రకటించారు ప్రధానమంత్రి. తీరా చూస్తే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలలోకే వందే భారత్ రైళ్లు పరిమితం అయ్యాయి.
దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా వజ్రోత్సవాలను పురస్కరించుకుని దేశంలోని ప్రధాన ప్రాంతాలలో వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని కుండ బద్దలు కొట్టారు. తీరా అన్నీ భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలకే పరిమితం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా బెంగళూరు, చెన్నైలలో వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కానీ ఎంతో ప్రాధాన్యత కలిగిన , ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరంగా పేరొందింది తెలంగాణ రాజధాని హైదరాబాద్. ఇప్పటికే గ్లోబల్ సిటీగా పేరొందింది. ఐటీ, లాజిస్టిక్ రంగాలలో టాప్ లో నిలిచింది.
అంతర్జాతీయంగా నిత్యం రాక పోకలు సాగిస్తుంటారు విమానయాన పరంగా. ఇక దేశీయంగా మార్కెట్ పరంగా ముంబై తర్వాత హైదరాబాద్ కూడా రేసులో ఉంది. ఈ తరుణంలో ఇంత ప్రాధాన్యత కలిగిన తెలంగాణకు ఎందుకు వందే భారత్ రైలు రాలేదన్నది ఇప్పటి వరకు తమకు అర్థం కావడం లేదంటోంటో తెలంగాణ ప్రభుత్వం.
ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించామని కానీ కుంటి సాకులు చెబుతూ దాట వేత ధోరణి అవలంభిస్తోందంటూ ఆరోపిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల వరకు అయితే ఓకే కానీ ప్రధాన ప్రాంతంపై వివక్ష అన్నది మంచిది కాదని రాష్ట్ర ప్రజలు సూచిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అయినా కనీసం అడగక పోవడం దారుణమని పేర్కొంటున్నారు.
Also Read : డిజిటల్ చెల్లింపులకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం