Varun Gandhi : అగ్నిపథ్ ఎందుకు కోటి జాబ్స్ భర్తీ చేయండి
నిప్పులు చెరిగిన ఎంపీ వరుణ్ గాంధీ
Varun Gandhi : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi) మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఆయన పదే పదే మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
మరో వైపు ప్రజలను ఇబ్బంది పెడితే నిలదీస్తున్నారు. వరుణ్ గాంధీతో పాటు మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ కూడా ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నారు.
బీజేపీ హై కమాండ్ మాత్రం కిమ్మనకుండా ఉంటోంది. రూరల్ ఎకానమీ మీద వరుణ్ గాంధీ ఓ పుస్తకాన్ని కూడా రాశారు. గ్రామీణ భారతాన్ని నిర్వీర్యం చేస్తే భవిష్యత్తులో దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా సాయుధ దళాలలో కాంట్రాక్టు పద్దతిన యువకులను భర్తీ చేసే అగ్నిపథ్ స్కీంను కేంద్రం తీసుకు వచ్చింది.
దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఆస్తులు తగులబడి పోతున్నాయి. కానీ మోదీ స్పందించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు వరుణ్ గాంధీ.
దేశంలో కోటికి పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ముందు వాటిని భర్తీ చేశాక అగ్నిపథ్ గురించి ఆలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి సూచించారు వరుణ్ గాంధీ(Varun Gandhi).
ఈ స్కీం వల్ల దేశంలోని యువతకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు ఎంపీ. ప్రస్తుతం వరుణ్ గాంధీ లేవదీసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పోతోంది.
ఇదే క్రమంలో ఎంపీ వెల్లడించిన గణాంకాలను ప్రత్యేకంగా ఎంఐఎం ఎంపీ ప్రస్తావించడం విశేషం.
Also Read : 24న దేశ వ్యాప్తంగా ఎస్కేఎం ఆందోళన