Varun Gandhi Comment : క‌మలంలో ‘ధిక్కార స్వ‌రం’ క‌ల‌క‌లం

వ‌రుణ్ గాంధీ నిజ‌మైన లీడ‌ర్

Varun Gandhi Comment : మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ లీడర్ గా పేరొందిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి, ఆయ‌న ప‌రివారానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న‌ది ప్ర‌తిప‌క్షాలు అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే.

త‌న బీజేపీకి చెందిన ఎంపీ వ‌రుణ్ గాంధీ(Varun Gandhi) మాత్రం కంట్లో న‌లుసుగా మారాడు. ఈ దేశం ప‌ట్ల అత్యంత ఎరుక‌తో ఉన్నారు. ప్ర‌జ‌లంటే 

ఆయ‌న‌కు వ‌ల్ల‌మాలిన అభిమానం. పార్టీలో ఉంటూనే కేంద్ర స‌ర్కార్ చేస్తున్న త‌ప్పిదాల‌ను నిరంత‌రం ప్ర‌శ్నిస్తున్నారు.

రైతుల‌పై మీ ప్ర‌తాపం ఆపండి మోదీజీ(PM Modi). ఇంకెంత మంది రైతుల ప్రాణాలు పోవాల‌ని అనుకుంటున్నారంటూ ప్ర‌శ్నించారు. ఆపై సాగు 

చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన రైతుల‌కు అండ‌గా నిలిచారు.

బీజేపీ ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ వ‌రుణ్ గాంధీ జోలికి మాత్రం వెళ్ల‌డం లేదు. ఆయ‌న నిజాలు మాట్లాడుతున్నారు. అవ‌స‌ర‌మైన ప్ర‌తి స‌మ‌యంలో త‌న గొంతు విప్పుతున్నారు.

ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్రాన్ని నిల‌దీస్తున్నారు. గ‌త ఎనిమిదేళ్ల బీజేపీ పాల‌న‌లో ఎందుకు 2 కోట్ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌లేదంటూ ప్ర‌శ్నించారు.

అందుకు సంబంధించి ఏయే శాఖ‌ల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ప్ర‌క‌టించాడు. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 1980లో పుట్టిన ఈ యువ నాయ‌కుడు పిలిభిత్ నియోజ‌క‌వ‌ర్గం నుండి మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు.

బీజేపీలో కీల‌క ప‌ద‌వి చేప‌ట్టారు. కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వ‌స్తున్నారు. అగ్ని ప‌థ్ స్కీం(Agnipath Skim) వ‌ల్ల దేశానికి మేలు జ‌ర‌గ‌ద‌ని ధ్వ‌జ‌మెత్తాడు.

ఇది పూర్తిగా ర‌క్ష‌ణ రంగాన్ని నిర్వీర్యం చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని హెచ్చ‌రించాడు. వ్య‌వ‌సాయ రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తే దేశం స‌ర్వ నాశ‌నం అవుతుంద‌ని, రైతుల‌కు మేలు చేకూర్చేలా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు.

కార్పొరేట్ల‌కు, బ‌డా బాబుల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు ఊడిగం చేయ‌డం వ‌ల్ల లేదా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వల్ల దేశ ఆర్థిక ప‌రిస్థితి బాగు ప‌డ‌ద‌ని ప‌రోక్షంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని హెచ్చ‌రించారు వ‌రుణ్ గాంధీ(Varun Gandhi Comment).

2004లో బీజేపీలో చేరిన వ‌రుణ్ గాంధీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. కానీ పార్టీలో ఉంటూనే కేంద్ర స‌ర్కార్ ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వం ఉన్న‌ది ప్ర‌జ‌ల కోసం పాల‌కుల కోసం కాదు..వ్యాపార వేత్త‌ల కోసం కాద‌ని సంచ‌ల‌న కామెంట్స్ కూడా చేశారు.

ఇదిలా ఉండ‌గా ఎంపీలాడ్ మొత్తాన్ని నిర్ణీత స‌మ‌యం కంటే ముందే ఖ‌ర్చు చేసిన ఏకైక ఎంపీగా పేరొందారు. అవినీతికి వ్య‌తిరేకంగా జ‌న్ లోక్ పాల్ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చిన మొద‌టి వ్య‌క్తి వ‌రుణ్ గాంధీనే.

ఆయ‌న రాజ‌కీయ నాయ‌కుడే కాదు కాల‌మిస్ట్, క‌వి, ర‌చ‌యిత‌. ఈ దేశం ప‌ట్ల , కోట్లాది ప్ర‌జ‌ల ప‌ట్ల అచంచ‌ల‌మైన న‌మ్మ‌కమే కాదు ప్రేమ కూడా ఉంది. పాల‌కులు సేవ‌కులు మాత్ర‌మే ఉండాల‌ని ఆయ‌న న‌మ్ముతారు. ఈ దేశాన్ని బ‌లోపేతం చేసే గ్రామీణ వ్య‌వ‌స్థ‌లో మార్పులు రావాల‌న్న‌ది ఆయ‌న క‌ల‌.

ఏది ఏమైనా వ‌రుణ్ గాంధీ దిశా నిర్దేశం చేయ‌గ‌లిన నాయ‌కుడుగా ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దు. ఇలాంటి వాళ్లే కావాలి భార‌త దేశానికి.

Also Read : నీతి ఆయోగ్ మీటింగ్ కు నితీష్‌..కేసీఆర్ డుమ్మా

Leave A Reply

Your Email Id will not be published!