Varun Gandhi : కేంద్ర సర్కార్ పై వరుణ్ గాంధీ ఫైర్
ఆర్థిక నేరగాళ్లు ఎక్కడున్నారని ప్రశ్న
Varun Gandhi : ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నందుకు మోద ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే కామెంట్స్ చేశారు.
దీనిని తీవ్రంగా తప్పు పట్టారు అదే పార్టీకి చెందిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi). ఆయన గత కొంత కాలంగా మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
గతంలో సాగు చట్టాలను తీసుకు రావడాన్ని తప్పు పట్టారు. ఆపై వ్యవసాయ రంగాన్ని పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. కనీస మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం జరిగిన రైతులు చేపట్టిన పోరాటానికి బేషరతుగా మద్దతు పలికారు. ఆ తర్వాత దేశంలో 2 కోట్లకు పైగా ఖాళీలు ఉన్నాయని ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయడం లేదంటూ మోదీని ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించి డేటాను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనిని ఆధారంగా చేసుకుని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దన్ ఓవైసీ నిజాలను వెల్లడించినందుకు ఎంపీ వరుణ్ గాంధీని ప్రత్యేకంగా అభినందించారు.
ఆపై మోదీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలపై మోదీ చేసిన రేవ్డీ చిచ్చుకు ఎంపీ కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో భారీ మొత్తంలో మొండి బకాయిలను మాఫీ ఎందుకు చేశారో సభా ముఖంగా దేశ ప్రజలకు చెప్పాలన్నారు వరుణ్ గాంధీ(Varun Gandhi).
మొహల్ చోక్స, రిషి అగర్వాల్ ల పేర్లు ఉచిత రెవిడి జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.
Also Read : నీతి ఆయోగ్ కు నితీష్ కుమార్ డుమ్మా