Varun Gandhi Owaisi : ఓవైసీకి వరుణ్ గాంధీ థ్యాంక్స్
కొలువుల డేటా ప్రస్తావించినందుకు
Varun Gandhi Owaisi : ఈ దేశంలోని మోదీ సర్కార్ కొలువు తీరి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బిగ్ డేటాను షేర్ చేశారు.
ఇందులో సంవత్సరాల వారీగా మోదీ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, ఎలా మోసం చేసిందో బట్ట బయలు చేశారు.
ఇదిలా ఉండగా అదే భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ప్రత్యేకంగా అద్భుతమైన గణాంకాలను షేర్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు ప్రత్యేకంగా ఓవైసీకి(Varun Gandhi Owaisi) .
భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాస్తవమైన సమాచారాన్ని పంచు కోవడంలో తప్పు లేదని పేర్కొన్నారు. సోమవారం వరుణ్ గాంధీ(Varun Gandhi) ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పుడు వరుణ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ ఉద్యోగాల డేటాను బట్ట బయలు చేసింది మాత్రం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీనే కావడం విశేషం.
ఉద్యోగాల కల్పనపై తన ప్రశ్నలను ఓవైసీ ప్రస్తావించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు వరుణ్ గాంధీ వీడియోను కూడా పంచుకున్నారు.
దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ 60 లక్షలకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. దీనినే ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇది తన డేటా కాదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అందించారని తన ప్రసంగంలో ఓవైసీ(Owaisi) చెప్పారు. నిరుద్యోగం దేశంలో అత్యంత ప్రధానమైన సమస్య.
దేశంలో నాయకులు దీనిపై ఫోకస్ పెట్టాలని కోరారు. ఉపాధిపై తాను లేవనెత్తిన ప్రశ్నలను ఓవైసీ చెప్పడాన్ని అభినందించారు.
Also Read : బెంగాల్ లో యూనివర్శిటీలకు సీఎం సుప్రీం