Vasireddy Padma: మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా !
మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా !
Vasireddy Padma: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికే వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగడానికి వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma) ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఆమె రాజ్యాంగ బద్దమైన మహిళా కమీషన్ చైర్మెన్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మైలవరం లేదా జగ్గయ్యపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
Vasireddy Padma Resign
ముఖ్యమంత్రిగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతూ మీరు అమలు చేసిన పధకాలు, నిర్ణయాలు వారి పట్ల మీ నిబద్ధత రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మార్గ దర్శనం. మహిళా సాధికారతకు అర్ధం చెప్పిన మీ పాలన గురించి ప్రచారం చేయాలని పేద ప్రజలు బాగుండాలంటే… మీరు ముఖ్యమంత్రిగా కలకాలం ఉండాలని ప్రజల ముందు చెప్పాలనే సదుద్దేశ్యంతో… ఎన్నికల ముందు నూతన బాధ్యతలు స్వీకరించాలని భావిస్తూ… మహిళా కమీషన్ చైర్మ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమె లేఖలో పాల్గొన్నారు. దీనితో ఆమె రాజీనామా ఆమోదం అయిన వెంటనే పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
Also Read : Mudragada Padmanabham: ముద్రగడతో వైసీపీ నాయకుల భేటీ ! వైసీపీలోనికి ముద్రగడ కుటుంబం ?