VC Sajjanar : ఉచిత ప్రయాణం గుర్తింపు కార్డు ముఖ్యం
లేకపోతే వర్తించదన్న ఎండీ
VC Sajjanar : హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీంతో వేలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున బస్సుల్లో ఎక్కేందుకు పోటీ పడుతున్నారు.
VC Sajjanar Comment about Free Bus Identity
దీంతో రద్దీ పెరిగింది. బస్సులు జనంతో కిటకిట లాడుతున్నాయి. ఈ పోటీని తట్టుకోలేక పోతోంది ఆర్టీసీ సంస్థ. ఇందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్(VC Sajjanar). ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించారు.
ఈ సౌకర్యం కేవలం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు నగరాలలో తిరిగే మెట్రో బస్సుల్లో వర్తిస్తుందని, సూపర్ డీలక్స్ లలో ఉండదని ఈ విషయాన్ని గమనించాలని సూచించారు ఎండీ. ఇదే సమయంలో తెలంగాణలో నివసించే మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ కు వర్తిస్తుందని స్పష్టం చేశారు వీసీ సజ్జనార్.
అంతే కాకుండా అంతరాష్ట్ర ఎక్స్ ప్రెస్ , పల్లె వెలుగు బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. అయితే మహిళా ప్రయాణికులకు ప్రయాణ దూరంపై పరిమితి లేదన్నారు.
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నట్లు ఏదైనా ఫోటో ఆధారిత గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ సౌకర్యాన్ని మహిళలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సజ్జనార్.
Also Read : Revanth Reddy : నిఖత్ జరీన్ కు భారీ నజరానా