Venkatesh Prasad KL Rahul : సెలక్షన్ కమిటీపై ప్రసాద్ ఫైర్
ఆడకున్నా కేఎల్ రాహుల్ ఎంపిక
Venkatesh Prasad KL Rahul : భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ నిప్పులు చెరిగాడు. గతంలో ఎన్నడూ లేనంతగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై, క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ, సభ్యులపై సంచలన ఆరోపణలు చేశాడు.
ప్రపంచంలో ఎక్కడైనా క్రీడా సంస్థలు ఆయా దేశాలలోని ఆటగాళ్ల ప్రతిభా పాటవాలపై ఆధారపడి ఎంపిక చేస్తారని కానీ భారత దేశంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాత్రం కేవలం తమకు తోచిన విధంగా, ఫేవరిటజం ఆధారంగా ఎంపిక చేస్తున్నారంటూ ధ్వజమెత్తాడు.
దీని వల్ల దేశంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా సరైన అవకాశాలు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వెంకటేశ్ ప్రసాద్. ఒక రకంగా సెలక్షన్ కమిటీని ఏకి పారేశాడు మాజీ క్రికెటర్. నాగ్ పూర్ లో ఆసిస్ తో జరిగిన టెస్టు ను ఈ సందర్భంగా ఉదహరించాడు.
వెంకటేశ్ ప్రసాద్ కేఎల్ రాహుల్ ను(Venkatesh Prasad KL Rahul) ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏరకంగానూ పర్ ఫార్మెన్స్ చేయని అతడిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించాడు.
శుభ్ మన్ గిల్ ఫామ్ లో ఉన్నా పట్టించు కోలేదని కానీ రాహుల్ ను కావాలని ఎంపిక చేశారంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్. కేఎల్ రాహుల్ పనితీరు ఆధారంగా ఎంపిక చేయలేదని కేవలం అభిమానం ఆధారంగా ఎంపిక చేశారంటూ ధ్వజమెత్తారు.
ఆటలో స్థిరత్వం గత ఎనిమిది ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిందన్నారు. కేఎల్ రాహుల్ 46 మ్యాచ్ లలో 34.0 టెస్టు సగటుతో మాత్రమే ఉందని పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయాలని సూచించాడు వెంకటేశ్ ప్రసాద్.
Also Read : హిట్ మ్యాన్ వల్లే కొంప మునిగింది