F3 Movie : ఎఫ్ 3 మూవీ వ‌సూళ్ల సునామీ

రూ. 110 కోట్ల గ్రాస్ వ‌సూలు

F3 Movie : న‌వ్వులు పండించ‌డంలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌న‌కు త‌నే సాటి. మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్ట‌ర్ గా పేరొందాడు. విక్ట‌రీ వెంక‌టేశ్ , మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా, మెహరీన్ న‌టించారు.

వీరితో పాటు ప్ర‌గ‌తి, సునీల్, ఆలీ, ప్ర‌దీప్ , రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లలో న‌టించారు. గ‌తంలో తెర‌కెక్కించిన ఎఫ్ 2 మూవీ దుమ్ము రేపింది. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో నిర్మాత దిల్ రాజు ఎఫ్ 3(F3 Movie) ని సీక్వెల్ గా నిర్మించాడు.

రిచ్ నెస్ తో పాటు ఇంటిల్లిపాది క‌లిసి కూర్చుని చూసేలా, న‌వ్వుకునేలా తీర్చి దిద్దాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. విక్ట‌రీ వెంక‌టేశ్ రే చీక‌టితో , వ‌రుణ్ తేజ్ న‌త్తితో న‌టించ‌డం ఇందులో ప్ర‌త్యేక‌త‌.

ఎఫ్ 3 మూవీ స్టార్టింగ్ నుంచి మూవీ పూర్త‌య్యేంత వ‌ర‌కు న‌వ్వులు పూయించాడు. దీంతో జ‌నం ఊహించ‌ని రీతిలో ఆద‌రించారు. ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా క‌లెక్ష‌న్లు కొల్ల గొడుతూ దూసుకు పోతోంది ఎఫ్ 3.

మ‌రో వైపు ఎఫ్ 2 మూవీ కంటే ఎఫ్ 3 గ‌ల్లా పెట్టెల‌ను నింపుతోంది. నిర్మాత‌ను సంతోషానికి గురి చేసింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ చిత్రం గత నెల మే 27న విడుద‌లైంది.

కేవ‌లం 9 రోజుల లోపే రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి చేరింది. మూవీ(F3 Movie) వీకెండ్ లో ఎఫ్ 3కి పెద్ద ఎత్తున క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 110 కోట్ల గ్రాస్ అందుకుంది.

పెట్టిన పెట్టుబ‌డి ఇప్ప‌టికే వ‌చ్చేసింద‌ని ఇక అంతా ఆదాయ‌మేన‌ని పేర్కొంటున్నారు సినీ వ‌ర్గాలు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం దూసుకు పోవ‌డం ఖాయ‌మంటున్నారు.

Also Read : ఘ‌నంగా ఎంటీవీ అవార్డుల ఉత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!