Anas Mallick : కాబూల్ లో ‘వియాన్’ పాక్ జర్నలిస్ట్ కిడ్నాప్
పాక్ నుంచి పని చేస్తున్న అనాస్ మల్లిక్
Anas Mallick : ఆఫ్గనిస్తాన్ ను అక్రమంగా స్వాధీనం చేసుకున్న తాలిబన్ల తీరు మారడం లేదు. తాజాగా ఆఫ్గన్ లో తాలిబన్లు తమ ఆధీనంలోకి వచ్చిన మొదటి వార్షికోత్సవాన్ని కవర్ చేసేందుకు అక్కడికి వెళ్లిన వియాన్ న్యూస్ ఛానల్ పాకిస్తాన్ జర్నలిస్ట్ అనాస్ మల్లిక్ ను కిడ్నాప్ చేశారు.
ఆపై దాడికి కూడా పాల్పడ్డారు. ఇదిలా ఉండగా అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా చీఫ్ ఐమాన్ అల్ జవహిరి హత్యను కవర్ చేసేందుకు ఆఫ్గనిస్తాన్ కు వెళ్లాడు.
అక్కడికి చేరుకున్న తర్వాత మాలిక్ కనిపించకుండా పోయినట్లు సమాచారం అందింది. ఈ విషయాన్ని గురువారం రాత్రి అనాస్ మల్లిక్(Anas Mallick) ఆచూకీ లభించడం లేదంటూ తోటి జర్నలిస్ట్ ట్విట్టర్ వేదిగా ట్వీట్ చేశాడు.
దీంతో పాకిస్తాన్ తో పాటు వియాన్, ఇతర న్యూస్ ఛానళ్లు పెద్ద ఎత్తున మాలిక్ అదృశ్యంపై ప్రచారం చేశాయి. కాబూల్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో అతడి గురించి ఎటువంటి సమాచారం లేదు.
దీంతో అక్కడి పాకిస్తాన్ రాయబారి తాలిబన్ ప్రభుత్వంతో ఈ విషయం గురించి మాట్లాడారు. ముందస్తుగా అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
అనాస్ మల్లిక్(Anas Mallick) ప్రస్తుతం కాబూల్ లో క్షేమంగా ఉన్నారని పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ధ్రువీకరించారు.
పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్ట్ మాలిక్ క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
అతడితో కొద్ది సేపు ఫోన్ లో మాట్లాడాను. ప్రస్తుతానికి ఆయన సేఫ్ అని వెల్లడించారు. పాక్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో కూడా ట్విట్టర్ ద్వారా సమాచారం పంచుకున్నారు.
Also Read : ఆర్థిక సంక్షోభం అంచున పాకిస్తాన్ – ఇస్మాయిల్