PAK Man Says Modi Viral : యా అల్లా మోదీని మాకు ఇవ్వండి
పాకిస్తాన్ లో ప్రధానమంత్రికి ఆదరణ
PAK Man Says Modi Viral : ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా యా అల్లా మోడీని మాకు ఇవ్వండి..తద్వారా ఆయన దేశాన్ని చక్కదిద్దగలడు అని ఆ దేశానికి చెందిన ఒకరు ఆకాశానికి ఎత్తేయడం విస్తు పోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని ఇవ్వాలని కోరారు. ఇప్పుడు వైరల్ గా మారింది. తమ దేశంలో కంటే ఇండియాలోనే బాగుందని పేర్కొన్నారు.
మోదీ పాలనలో తాను జీవించేందుకు సిద్దంగా ఉన్నానంటూ వీడియో కూడా షేర్ చేశాడు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పాకిస్తాన్ లో చర్చకు దారితీసేలా చేసింది. పాకిస్తాన్ యూట్యూబర్ సనా అమ్జాద్ పోస్ట్ చేసిన వీడియోలో దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై షెహబాజ్ షరీఫ్ సర్కార్ పై తోటి పాకిస్తానీ విరుచుకు పడ్డాడు. మాజీ జర్నలిస్ట్ జనా అమ్జాద్ అనేక పాకిస్తానీ(PAK Man Says Modi Viral) మీడియా సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు.
వైరల్ వీడియోలో పాకిస్తాన్ సే జిందా భాగో చాహే ఇండియా చలే జావో (పాకిస్తాన్ నుండి మీ ప్రాణాలను కాపాడుకోండి. లేదంటే భారత దేశంలో ఆశ్రయం పొందడం ద్వారా అయినా పారిపోండి ) అనే నినాదాన్ని వీధుల్లో ఎందుకు లేవనెత్తారంటూ స్థానికుడిని ప్రశ్నించింది. తాను పాకిస్తాన్ లో పుట్ట కూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆన్సర్ ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న దుర్భరమైన పరిస్థితిని తెలియ చేస్తోంది.
ఇస్లామిస్ట్ దేశం వచ్చింది కానీ ఇస్లాంను స్థాపించ లేక పోయామని వాపోయాడు. మోదీ మనకంటే చాలా గొప్పవాడు. అక్కడి ప్రజలు ఆయనను గౌరవిస్తారు. మనకు మోడీ ఉంటే నవాజ్ , బెనజీర్, ఇమ్రాన్ అవసరం లేదన్నాడు.
Also Read : బీజేపీ వన్ మ్యాన్ షోగా మారింది