Buggana Rajendranath Vizag : ఏపీకి విశాఖనే రాజ‌ధాని – బుగ్గ‌న

రాష్ట్ర ఆర్థిక మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న

Buggana Rajendranath Vizag : మొన్న‌టికి మొన్న ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక ఏపీకి అస‌లైన రాజ‌ధాని అమ‌రావ‌తి కాద‌ని తేల్చి చెప్పారు. మొత్తంగా విశాఖ‌నే ఏపీకి కేపిట‌ల్ సిటీ అని వెల్ల‌డించారు. దీనిపై మ‌రోమారు అనుమానం లేకుండా కుండ బ‌ద్ద‌లు కొట్టారు. హైద‌రాబాద్ లో కొలువు తీరిన సినీ రంగానికి చెందిన వారంతా విశాఖ‌కు రావాల‌ని తాను కూడా వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి(Buggana Rajendranath Vizag ) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

మూడు రాజ‌ధానులు అంటూ ఉండ‌వ‌న్నారు. బెంగ‌ళూరులో జ‌రిగిన స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి గంద‌ర గోళం లేద‌ని , కానీ విప‌క్షాలే కావాల‌ని రాద్దాంతం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. త‌మ‌కు పూర్తిగా క్లారిటీ ఉంద‌న్నారు. మూడు రాజ‌ధానులు అన్న‌ది కాద‌న్నారు. ఈ విష‌యంలో మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నామ‌ని విశాఖ ప‌ట్ట‌ణ‌మే అస‌లు సిస‌లైన ఏపీకి రాజ‌ధాని అని స్ప‌ష్టం చేశారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Vizag ).

విశాఖ న‌గ‌రం నుంచే పాల‌నను సాగించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి. ఇప్ప‌టికే ఓడ‌రేవుతో పాటు కాస్మో పాలిట‌న్ సిటీగా గుర్తింపు పొందింద‌ని, ప్ర‌ముఖ ఐటీ సంస్థ కూడా ప్రారంభించ‌నుంద‌ని చెప్పారు. భ‌విష్య‌త్తు లోనూ విశాఖ అభివృద్ది చెంద‌డం ఖాయ‌మ‌న్నారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి. ప్ర‌స్తుతం బుగ్గ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : ప్ర‌క‌టించిన రూ. 100 కోట్లు ఎక్క‌డ‌

Leave A Reply

Your Email Id will not be published!