Vijay Sai Reddy : ఉపాధి హామీ బకాయిలు చెల్లించండి
లోక్ సభలో ఎంపీ విజయ సాయి రెడ్డి
Vijay Sai Reddy : న్యూఢిల్లీ – తమ రాష్ట్రానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద బకాయిలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని కోరారు రాజ్యసభలో ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్పందించారు.
Vijay Sai Reddy Raised
ఇప్పటి వరకు ఏపీకి రావాల్సిన బకాయిలు రూ. 1019 కోట్లు ఉన్నాయని ఎంపీ స్పష్టం చేయగా ఇవన్నీ అబద్దమని పేర్కొన్నారు మంత్రి. ఇప్పటి వరకు కేవలం ఏపీకి సంబంధించి బకాయిలు కేవలం రూ. 122 కోట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సూచించారు.
ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేయడమన్నది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పని డిమాండ్‌ను బట్టి వాటికి నిధులు సమ కూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనంగా మరో రూ.10వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అయితే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నిధులు ఆశిస్తుందని మంత్రి వెల్లడించారు.
Also Read : Lok Sabha Speaker : లోక్ సభ ఘటన బాధాకరం