Vijay Sai Reddy : వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు.
రాజధాని పేరు చెప్పి పక్కా వ్యాపారం చేశాడని మండిపడ్డారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకు(Vijay Sai Reddy) ముట్టింది రూ. 118 కోట్లు మాత్రమేనని కానీ ఇంకా వేల కోట్లు కాజేశాడని , కమీషన్ల పేరుతో లూటీ చేశాడని ద్వజమెత్తారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
Vijay Sai Reddy Slams Chandrababu Naidu
ఒక రకంగా తాను తీసుకున్న కమీషన్లు చూస్తే ఓ సముద్రం కంటే ఎక్కువే ఉన్నాయని పేర్కొన్నారు. వీటి నుంచి తప్పించు కునేందుకు పదే పదే ఢిల్లీ టూర్ కు వెళ్లడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలన్నారు. చంద్రబాబు నాటకాల గురించి ప్రజలు ఏనాడో గుర్తించారని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి.
ఈ అమరావతి బిగ్ స్కాంలో కీలకమైన పాత్ర సింగపూర్ కు చెందిన మంత్రి ఈశ్వరన్ పట్టుబడ్డాడని, ఈయన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. సీఆర్డీఏ ప్లానింగ్ లో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లతో పాటు లక్ష కోట్లకు పైగా ఆస్తుల చిట్టా ఇంకా బయటకు రావాల్సి ఉందన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
Also Read : PM Modi Congrats : ఇస్రో శాస్త్రవేత్తల కృషి భేష్ – మోదీ
