Vijay Sai Reddy : అమరావతి – ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. ప్రత్యేకించి బీజేపీ చీఫ్ గా కొలువు తీరిన దగ్గుబాటి పురందేశ్వరి ప్రత్యేకంగా వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆమె ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ఎంపీ విజయ సాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు.
Vijay Sai Reddy Comment on Purandeswari
ఈ ఏమరకు ఏకంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. గత 10 ఏళ్లుగా జగన్ , విజయ సాయి ముందస్తు బెయిల్ తో అధికారాన్ని చెలాయిస్తున్నారంటూ ఆరోపించారు.
వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ రెడ్డిని, ఎంపీ విజయ సాయి రెడ్డిని పదవుల నుంచి తొలగించాలని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు పిటిషన్ లో. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
73 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ను ఎంత మానసిక క్షోభకు గురి చేశారో ఉమ్మడి ఏపీ ప్రజలందరికీ తెలుసని , ఆ విషయం మరిచి పోయి నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఏం కూతురివమ్మా నీవు..శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : Damodara Raja Narasimha : టికెట్ల నిర్వాకం దామోదర ఆగ్రహం