Vijay Sethupathi First Look : విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ కిర్రాక్
షారుక్ ఖాన్ తో పోటీ పడుతున్న నటుడు
Vijay Sethupathi First Look : యంగ్, డైనమిక్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన అట్లీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ఇంకా విడుదల కాకుండానే భారీ మార్కెట్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ. 363 కోట్లు కొల్లగొట్టింది.
సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , టీజర్ దుమ్ము రేపుతోంది. బాద్ షా షారుఖ్ ఖాన్ తో పాటు నయనతార నటించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. వచ్చే సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా జవాన్(Jawan) ను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు.
Vijay Sethupathi First Look Release
అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్రానికి సంబంధించి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shah Rukh Khan) విడుదల చేశారు. రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
విజయ్ సేతుపతి పోస్టర్ కు ది డీలర్ ..ఆఫ్ డెత్ అనే అద్భుతమైన ట్యాగ్ లైన్ కూడా జోడించారు దర్శకుడు అట్లీ కుమార్. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ జవాన్ చిత్రాన్ని నిర్మించారు. నీలి రంగులో తడిసి పోయి ..జవాన్ ఖాన్ కు విరోధిగా నటిస్తున్న సేతుపతి పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా పోస్టర్ కిర్రాక్
నీలిరంగులో తడిసిపోయి, పోస్టర్‌లో జవాన్‌లో విరోధిగా నటిస్తున్న సేతుపతి, ఓవల్ సన్‌గ్లాసెస్ ధరించి, పెదవుల అంచున స్లిమ్‌గా నవ్వుతూ, ఇతర విలన్‌ల క్లాసిక్ ప్రవర్తనను పోలి ఉంటుంది.
Also Read : Congress Economic Reforms : ఆర్థిక సంస్కరణలో మైలురాయి