#TalapathyVijay : విజయ తళపతి..అభిమానుల ఆరాధ్య దైవం
కోట్లాది మంది ప్రేమగా..ముద్దుగా..ఆప్యాయంగా.నోరారా పిలుచుకునే తళపతి విజయ్. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఓ వైపు రజనీకాంత్..కమల్ హాసన్..లాంటి దిగ్గజ నటుల సరసన నిలబడాలంటే ఎంత దమ్ముండాలి..ఎన్ని గట్స్ ఉండాలి..ఎప్పుడూ నవ్వుతూ..కూల్ గా వుండే ఈ అరుదైన నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
దేశం మొత్తం ఎన్నికల సందర్భంలో ఉన్నది. కానీ వందలాది మీడియా సంస్థలన్నీ అటు వైపు చూడటం మానేశాయి. కానీ ఒకే ఒక్కడిపై ఫోకస్ పెట్టాయి. ఇంతకీ అంత ప్రాముఖ్యత కలిగిన..పాపులర్ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా..అతడే కోట్లాది మంది ప్రేమగా..ముద్దుగా..ఆప్యాయంగా.నోరారా పిలుచుకునే తళపతి విజయ్. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఓ వైపు రజనీకాంత్..కమల్ హాసన్..లాంటి దిగ్గజ నటుల సరసన నిలబడాలంటే ఎంత దమ్ముండాలి..ఎన్ని గట్స్ ఉండాలి..ఎప్పుడూ నవ్వుతూ..కూల్ గా వుండే ఈ అరుదైన నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు మీద పడుతున్నా సరే యావత్ జనాన్ని తన వైపు తిప్పుకునే టాలెంట్ ఈ ఒక్క యాక్టర్ కే ఉంది. డ్రెస్ లను ఎంపిక చేసుకోవడం నుంచి బయట ఫ్యాన్స్ తో పలకరించే దాకా డిఫరెంట్ స్టయిల్ ను మెయింటెనెన్స్ చేయడం విజయ్ కి అలవాటు. మెర్సిల్ సినిమా ఇండియాను షేక్ చేసింది.
అట్లి తీసిన విజిల్ సినీ బాక్సులను బద్దలు కొట్టింది. ఒక్క సినిమాకు కనీసం 80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని తమిళ ఇండస్ట్రీలో టాక్.కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడి మేనరిజం మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. తాజాగా ఐటీ సోదాలు చేసింది. అయినా చెక్కు చెదర లేదు ఈ నటుడు. మొదటి నుంచి ఓ పద్ధతి ప్రకారం పెరుగుతూ వచ్చాడు. నో కామెంట్స్..నో కాంట్రవర్సీస్..ఓన్లీ సినిమానే అతడి లైఫ్. అడుగులు వేస్తే కొత్త మేనరిజం క్రియేట్ చేసుకుంటూ వెళతాడు. ఇంకొకరు తన గురించి ఆలోచించే లోపే మరో కొత్త స్టైల్‌తో మన ముందుకు వస్తాడు. చేతులు తిప్పడంలోను..సూటిగా మాట్లాడటంలోను..తనకు తనే సాటి. అందుకే ఫ్యాన్స్ అతడిని తళపతిగా పేరు పెట్టేసుకున్నారు. ఇతడి ఫాలోయింగ్ ను చూసి హిందీ స్టార్స్ షాక్ కు లోనయ్యారు. లెక్కలేనంత సంపాదించినా డోంట్ కేర్ అంటూ అత్యంత సింప్లిసిటీని ఇష్టపడే ఈ నటుడు తన ఉన్నతికి కారణమైన ప్రతి ఒక్కరిని స్మరించు కోవడం, కనిపిస్తే గౌరవించడం మానుకోలేదు.
అంతెందుకు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అందరితో పాటే తాను గంటల కొద్దీ లైన్లో నిలుచుని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మందీ మార్బలం, రిటర్నింగ్ ఆఫీసర్ కోరినా ఒప్పుకోలేదు. వృత్తి పరంగా నటుడినే కావచ్చు..అయినంత మాత్రాన తనకు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశాడు విజయ్. సహచర నటులు ఒకరిపై మరొకరు ఛలోక్తులు, కామెంట్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసే పనిలో నిమగ్నమైతే ..మనోడు మాత్రం అభిమానులకు అభివాదం చేస్తూ..మరొకరికి స్ఫూర్తి కలిగించేలా మాట్లాడేందుకు ట్రై చేస్తుంటాడు.
అందుకే ఒక్కసారి విజయ్ తో నటించే ఛాన్స్ వస్తే చాలని ఆరాటపడి..ఉబలాటపడే నటీమణులు..ముద్దుగుమ్మలు..ఎందరో. ఎక్కువగా పబ్లిసిటీకి దూరంగా ఉండటానికే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే ఈ యాక్టర్ తాను చేసే గుప్త దానాలు, సహాయం గురించి బయటకు చెప్పేందుకు ఒప్పుకోడు. సమాజం నాకు ఓ గుర్తింపు ఇచ్చింది. అంతే కాదు నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ఎనలేని అవకాశాలు నాకు కల్పించింది. సంపాదించిన దాంట్లోంచి ఇవ్వడం ధర్మమనే నమ్ముతానంటాడు విజయ్. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరు లేచి నిలబడి స్వాగతం పలకడం అతడిపై వారికున్న ప్రేమ కానే కాదు..తమను తాము గౌరవించు కోవడం. తళపతి ఇలాగే నటించాలి..నటిస్తూనే ఉండాలి..అలరించాలని ఆశిద్దాం.
No comment allowed please