Vikas Raj : పోలింగ్ రోజు సెలవు ప్రకటించాలి
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్
Vikas Raj : హైదరాబాద్ – రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30న పోలింగ్ రోజు ప్రభుత్వ సంస్థలు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు సిఇవో. ప్రైవేట్ , ఐటీ కంపెనీలు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. ఉద్యోగులు ఓటు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు వికాస్ రాజ్.
Vikas Raj Orders
గత ఎన్నికల్లో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిని సీరియస్ గా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం వికాస్ రాజ్(Vikas Raj) మీడియాతో మాట్లాడారు. అన్ని సంస్థలు సెలవులు ఇచ్చాయో లేదో పరిశీలించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ వెంటనే పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
సెలవులు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు వికాస్ రాజ్. ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలిపారు. 13 నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటలకు బంద్ చేశారని, 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిందని పేర్కొన్నారు.
నేటి నుంచి పోలింగ్ రోజు వరకు పూర్తిగా మద్యం బంద్ చేయాలని ఆదేశించారు.
Also Read : Priyanka Rahul : తెలంగాణతో మాది కుటుంబ బంధం