Delhi LG : ఢిల్లీ ఎల్జీగా విన‌య్ కుమార్ స‌క్సేనా

ఆమోదించిన రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్

Delhi LG : ఉన్న‌ట్టుండి ఢిల్లీ ఎల్జీగా బైజల్ త‌ప్పు కోవ‌డంతో ఎవ‌రు వ‌స్తార‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించింది కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే ఉప్పు నిప్పు లాగా మారింది ఢిల్లీ వ‌ర్సెస్ కేంద్రం.

త‌మ పెత్త‌నం చెలాయించేందుకు కేంద్రం య‌త్నిస్తోందంటూ ప‌లుమార్లు నిప్పులు చెరిగారు ఢిల్లీ ఆప్ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఈ మేర‌కు కేంద్రం, ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌ధ్య భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశాయి.

వాదాన‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఢిల్లీపై పెత్తనం నీదా నాదా అన్నది మొద‌టి నుంచీ కొన‌సాగుతోంది. దేశ రాజ‌ధాని కాబ‌ట్టి స‌ర్వ హ‌క్కులు త‌మ‌కే ఉన్నాయంటోంది.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం దేశం స‌మాఖ్య రాజ్యం. కేంద్రం జోక్యం అన‌వ‌స‌రం అంటున్నారు కేజ్రీవాల్. మొత్తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎలాగైనా స‌రే ఢిల్లీని చేజిక్కించు కోవాల‌ని చూసింది.

కానీ దేశ వ్యాప్తంగా మోదీ హ‌వా కొన‌సాగినా ఢిల్లీలో మాత్రం పాచిక‌లు ప‌ని చేయ‌లేదు. మోదీ మంత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో ఎలాగైనా సరే ఆప్ స‌ర్కార్ ప‌వ‌ర్స్ కు క‌త్తెర పెట్టాల‌ని ఎల్జీని తీసుకు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఎల్జీ వ‌ర్సెస్ సీఎంగా మారి పోయింది. ఇటీవ‌ల లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేసిన బైజాల్ తో రోజూ పంచాయ‌తీ జ‌రిగేది. దీంతో ఆయ‌న మోదీకి కావాల్సిన వ్య‌క్తి కానీ ఎందుక‌నో త‌ప్పుకున్నారు.

తాజాగా ఆయ‌న స్థానంలో యూపీకి చెందిన విన‌య్ కుమార్ స‌క్సేనాను ఢిల్లీ ఎల్జీ(Delhi LG) గా నియ‌మించింది కేంద్రం. ప్ర‌స్తుతం ఆయ‌న ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ చైర్మ‌న్ గా ఉన్నారు.

హానీ మిష‌న్ , స‌శ‌క్తి క‌ర‌ణ్ యోజ‌న‌, తోలు క‌ళాకారుల సాధికార‌త‌, ఖాదీ ప్ర‌కృతి పెయింట్ వంటి ప‌థ‌కాలు, ఉత్ప‌త్తుల‌ను ప్ర‌వేశ పెట్టారు.

Also Read : జ‌పాన్ తో భార‌త్ బంధం బ‌లీయం

Leave A Reply

Your Email Id will not be published!