Vineet Jindal Modi : మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై ఫిర్యాదు
కేసు నమోదు చేసిన పోలీసులు
Vineet Jindal Modi : ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ యుకెకు చెందిన బీబీసీ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై పీఎం క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమైంది. ఇందులో మోదీ నాయకత్వాన్ని, విశ్వసనీయతను, పనితీరును , ఆయన సీఎంగా ఉన్న కాలంలో చోటు చేసుకున్న అలర్లు, ఘటనలు, కేసుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇదే సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయని , దీనికి మోదీ కారణమనే విధంగా ఇందులో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ఇప్పటికే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.
పూర్తిగా మోదీ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన కూడా చేశారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి. ఇదిలా ఉండగా మోదీని కావాలని కించ పరిచేలా బీబీసీ డాక్యుమెంటరీ ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు బీబీసీపై. ఇది పూర్తిగా ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ ఆరోపించారు జిందాల్(Vineet Jindal) . 2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో హింస చెలరేగిన సమయంలో రాష్ట్ర సీఎంగా మోదీ ఉన్నారని, ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ పీఎంపై డాక్యుమెంటరీ తీయడాన్ని తప్పు పట్టారు వినీత్ జిందాల్.
దేశ ప్రజలు మోదీని పీఎంగా ఎన్నుకున్నారు. దేశంలో రాజ్యాంగ బద్దమైన ప్రభుత్వం ఉందని కానీ విద్వేషాలు రెచ్చగొట్టేలా బీబీసీ యత్నించిందంటూ ఆరోపించారు వినీత్ జిందాల్.
Also Read : శంకర్ మిశ్రాపై నాలుగు నెలలు వేటు